అగ్రవర్ణ పేద మహిళల నేస్తం జగనన్న నేస్తం…

మెరుగైన జీవసనోపాది, ఆర్థిక సాధికారిత లక్ష్యంగా వైఎస్ఆర్ ఈ బి సి నేస్తం…

రెడ్డి, కమ్మ,ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక చేయూత..

ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ళ పాటు రూ 45 వేలు ఆర్థిక సహాయం…

నేడు మూడవ విడత పథకాన్ని కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రారంభించి ఓసి అక్క చెల్లెమ్మల ఖాతాలలో రూ.15 వేలు జమ చేయనున్న సీఎం జగనన్న…

వైఎస్ఆర్ ఈబిసి నేస్తం ద్వారా…
రాష్ట్ర వ్యాప్తంగా మూడవ విడతలో లబ్దిదారులు:4,19,583 ,లబ్ది: రూ629.37 కోట్లు,

అన్నమయ్య జిల్లాలో మూడవ విడత లబ్ధిదారులు: 23,287,లబ్ది:రూ 34.93 కోట్లు

రాయచోటి నియోజకవర్గం లో మూడవ విడత లబ్ధిదారులు:3566 *లబ్ది: 5.25 కోట్లు

రాయచోటి నియోజక వర్గంలో మూడు విడతలలో ఈ బి సి నేస్త లబ్ది ..
■మొదటి విడతలో 3234 మంది లబ్దిదారులకు రూ 4.85 కోట్లు,
■రెండవ విడతలో 3632 మంది లబ్దిదారులకు రూ 5.44 కోట్లు,
■ఇప్పుడు మూడవ విడతలో 3566లబ్దిదారులకు రూ5.25 కోట్లు,
మూడు విడతల మొత్తం కలిపి లబ్ది: రూ 15.54 కోట్లు,

45 ఏళ్ళు పైబడిన ఎస్ సి ,ఎస్ టి,బిసి,మైనారిటీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఏటా రూ 18,750 చొప్పున 4 ఏళ్లలో రాయచోటి నియోజక వర్గంలో పొందిన లబ్ది: రూ 102.96 కోట్లు

వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతల్లో రాయచోటి నియోజక వర్గంలో అక్క చెల్లెమ్మలు పొందిన లబ్ది: రూ 108.97 కోట్లు

మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించింది. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, వెలమ తదితర అగ్రవర్ణ కులాల పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ పథకం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం మూడు సంవత్సరాలలో రూ 45 వేలు జమ చేయనున్నారు. ఈ నెల 14 న అనగా నేడు మూడవ విడత కార్యక్రమాన్ని కేంద్రంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

రాయచోటి నియోజక వర్గంలో వైఎస్ఆర్ ఈ బిసి నేస్తం మూడవ విడత లబ్ధిదారుల వివరాలు…

మండలం:చిన్నమండెం: ఆర్యవైశ్య:14 ,బ్రాహ్మణ:0 , ఈ బి సి:4 ,కమ్మ: 45 , కాపు: 5 , క్షత్రియ: 0,రెడ్డి:443, మొత్తం:501, లబ్ది: రూ 75.15 లక్షలు,
మండలం:గాలివీడు: ఆర్యవైశ్య: 5 ,బ్రాహ్మణ: 4 , ఈ బి సి: 0 ,కమ్మ: 1 , కాపు:776 , క్షత్రియ: 20 ,రెడ్డి:25, మొత్తం: 831 ,లబ్ది: రూ 124.65 లక్షలు,

మండలం:లక్కిరెడ్డిపల్లె: ఆర్యవైశ్య:3 ,బ్రాహ్మణ: 3 , ఈ బి సి: 0 ,కమ్మ: 0 , కాపు: 11 , క్షత్రియ:53 ,రెడ్డి:295, మొత్తం: 365, లబ్ది: రూ 54.75 లక్షలు,

మండలం:రామాపురం: ఆర్యవైశ్య:6 ,బ్రాహ్మణ: , ఈ బి సి: 12 ,కమ్మ: , కాపు: 24, క్షత్రియ: 16 ,రెడ్డి:404, మొత్తం: 462,లబ్ది: రూ 69.30 లక్షలు,

మండలం:రాయచోటి ఆర్యవైశ్య:45, బ్రాహ్మణ:11 , ఈ బి సి:20 ,కమ్మ: 33 , కాపు: 65 , క్షత్రియ:85 , రెడ్డి:587, మొత్తం: 846,లబ్ది: రూ 126.90 లక్షలు,

మండలం:సంబేపల్లె: ఆర్యవైశ్య:3 ,బ్రాహ్మణ:1 , ఈ బి సి:3 ,కమ్మ: 148 , కాపు: 62 , క్షత్రియ: 15 ,రెడ్డి:269, మొత్తం: 501, లబ్ది: రూ 75.15 లక్షలు

మండలాల వారీగా మూడు విడతల లబ్ది …

◆ గాలివీడు:
మొదటి విడత: లబ్ధిదారులు: 756, లబ్ది: రూ1,13,40,000,
రెండవ విడత: 834,
లబ్ది: రూ 1,25,10,000,
మూడవ విడత లబ్దిదారులు: 831,లబ్ది: రూ.1.24 కోట్లు,మొత్తం లబ్ది:రూ.3.62 కోట్లు
◆ సంబేపల్లె:
మొదటి విడత: లబ్దిదారులు: 493, లబ్ది: రూ73.95 లక్షలు,
రెండవ విడత: లబ్దిదారులు: 533,లబ్ది:రూ 79,95,000,
మూడవ విడత లబ్దిదారులు:501, లబ్ది: రూ75.15 లక్షలు,మొత్తం లబ్ది: రూ 2.29 కోట్లు

◆ చిన్నమండెం:
మొదటి విడత: లబ్దిదారులు: 446, లబ్ది:రూ 66.90 లక్షలు,
రెండవ విడత: లబ్దిదారులు: 513,
లబ్ది రూ: 76,95,000,
మూడవ విడత లబ్దిదారులు: 501,రూ 75.15 లక్షలు,మొత్తం లబ్ది: రూ 2.19 కోట్లు

◆ రాయచోటి మున్సిపాలిటీ అండ్ రూరల్:
మొదటి విడత: లబ్దిదారులు: 800, లబ్ది:రూ 119.70 లక్షలు,
రెండవ విడత: లబ్ధిదారులు: 923,లబ్ది:రూ 138.45 లక్షలు,
మూడవ విడత:లబ్దిదారులు: 846, లబ్ది:126.90 లక్షలు,మొత్తం లబ్ది: రూ 3.85 కోట్లు

◆ రామాపురం:
మొదటి విడతలబ్దిదారులు: 411, లబ్ది: రూ 61.65 లక్షలు,
రెండవ విడత లబ్ధిదారులు: 458,
లబ్ది: రూ 68,70,000,
మూడవ విడత లబ్దిదారులు: 462,లబ్ది: రూ69.30 లక్షలు,మొత్తం లబ్ది: రూ1.99 కోట్లు

◆ లక్కిరెడ్డిపల్లె:

మొదటి విడత లబ్ధిదారులు: 330,లబ్ది: రూ 49.50 లక్షలు,
రెండవ విడత లబ్ధిదారులు: 371,లబ్ది: రూ 65,65,000,
మూడవ విడత లబ్దిదారులు; 365, లబ్ది: రూ54.75 లక్షలు,మొత్తం లబ్ది: రూ 1.69 కోట్లు

మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా…
ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా ఓ సీ పేద అక్క చెల్లెమ్మల కోసం ఈబిసి పథకం ద్వారా ఏటా రూ 15 వేలు అందివ్వనుండడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ది చేకూరనుంది.

అమ్మకడుపులోని బిడ్డనుండి.. ఆప్యాయంగా పలకరించే పండు ముసలి వరకు..
అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగాజగనన్న ప్రభుత్వం ..

అమ్మకడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క చెల్లెమ్మలుకు అన్ని దశల్లోనూ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ,మహిళల భద్రత కోసం దిశ చట్టం, గ్రామ, వార్డు సచివాలయాలలో మహిళా కానిస్టేబుళ్ల నియామకం, అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇళ్ల పట్టాలు, పక్కా గృహాలు మంజూరు,అమ్మఒడి ద్వారా 1 వ తరగతి నుండి ఇంటర్ వరకు పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలలోఏటా రూ 15 వేలు,జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ల ద్వారా ఆర్థిక సహాయాలు, వైఎస్ఆర్ ద్వారా డ్వాక్రా రుణాల మాపీ, వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ 18,750 చొప్పున ఆర్థిక సహాయం, మరియు వారి ఆర్థికాభివృద్ధికి శిక్షణ ఇచ్చి అంగల్లు, దుకాణాలు, వ్యాపారాల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, వైఎస్ఆర్ సున్నావడ్డీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది.వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ కులాలకు ఏటా రూ 15 వేలు ఆర్థిక సాయం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద 60 ఏళ్ళు పైబడిన అవ్వలకు పెన్షన్, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ 2500 చొప్పున నెల నెలా పెన్షన్లు,మహిళలకు అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పన తదితర ఎన్నో పథకాలను పెట్టి జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

హర్షాతిరేకాలు…

సీఎం జగన్,ఎంపీ మిథున్, ఎంఎల్ఏ శ్రీకాంత్ లకు కృతజ్ఞతలు తెలిపిన రాయచోటి నియోజక వర్గ అగ్రవర్ణ పేద మహిళలు…

అగ్రవర్ణ పేదలకు జగన్ ప్రభుత్వం ఈబిసి పథకం మూడవ విడత అమలు చేయడంపై రాయచోటి నియోజక వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవు చున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అగ్రవర్ణ పేద మహిళలను పట్టించుకోలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న అండగా నిలబడుతున్నారని అక్కచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం జగనన్న, ఎంపీ మిథునన్న, ఎంఎల్ఏ శ్రీకాంతన్న లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *