అగర్తలా సెప్టెంబర్ 30: త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకున్నది. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ నేతృత్వంలోని తిప్ర మోతా పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్ తిప్రలాండ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వారు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనకు దిగారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ 2021లో తిప్ర మోతా పార్టీని స్థాపించక ముందు త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి గ్రేటర్ తిప్రల్యాండ్ సాధన కోసం సొంత పార్టీని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.