12 కోట్ల స్థిరాస్తులు, ఒకటిన్నర కిలోల బంగారం, 26 లక్షల నగదు
జమ్మికుంట తాహశీల్దార్ రజనీ అక్రమ ఆస్థుల డొంక
హనుమకొండ:కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ రజినీ అక్రమ ఆస్తుల డొంక ను ఏసీబీ అధికారులు తవ్వారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉందనే ఫిర్యాదుతో సోదాలు జరిపారు. ఏక కాలంలో ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని బంధువులు, బినావిూల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. బహిరంగ మార్కెట్ లో 12 కోట్ల విలువ గల స్థిరాస్తులు గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పాత్రలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు , 26 లక్షల నగదు,1 కిలో 462 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.