మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు కారల్‌ మార్క్స్‌
` ఆయన వర్థంతి
మానవ జాతి చరిత్ర అంతా అతీత శక్తుల, పుణ్యపురుషుల సృష్టింగా గోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మత అన్న మహోన్నత వ్యక్తి కారల్‌ మార్క్స్‌ . ప్రకృతిలోని సకల జీవకోటికి భిన్నంగా మానవుడు పరికరాలు ఉత్పత్తి చేసి ప్రకృతిని తనకు బానిసగా చేసుకొని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్‌ ఉద్బోధించాడు .చారిత్రక భౌతిక వాదంతో గత చరిత్రనే కాదు భవిష్యత్‌ ఎలా నడుస్తుందో వివరించి చెప్పిన మహోన్నతుడు. అద్భుతమైన అధ్యయనంతో అనితర సాధ్యమైన కృషితో మానవజాతిని ప్రభావితం చేశాడు.
మరణించి 132 ఏళ్ళు లైనా ప్రపంచాని ప్రభావితం చేస్తూనే వున్నాడు. ఆయన చూపిన మార్గంలో కోటాను కోట్ల మంది పయనిస్తూనే వున్నారు.
మార్క్స్‌ జీవించి నాటిక ప్రపంచ పరిస్థితి
అప్పటికి వెనుకబడివున్న ఐరోపాఖండంలో ‘‘ఫూడలిజం’’కు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు కొత్తసమాజ నిర్మాణానికి బాటలువేశాయి. ఈ పోరాటాలు14వ శతాబ్దం నుండి సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలే వేశాయి. 1455లో గూటెన్‌బర్గ్‌ అచ్చుయంత్రం తయారీ తో ప్రారంభించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం 1765 ఆవిరి యంత్రం రంగంలోకి రావటంతో నూతనదశకు చేరింది. పెట్టుబడిదారీ వర్గంతోపాటు ఆవిర్భావించిన కార్మికవర్గం అర్ధబానిస జీవితానికి విముక్తి లభిస్తుందని అనుకున్న వేతన బానిస గా మార్చింది. ‘‘లాభం’’ లతో కొత్త దోపిడీకి తెరలేచింది.
ఈ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం ఉదృతమైన పోరాటాలను ప్రారంభించింది. పనిగంటల తగ్గింపు, జీవించటానికి సరిపడే వేతనం, మెరుగైన పనిపరిస్థితులు, ప్రజాస్వామిక హక్కులకోసం కార్మిక సంఘాలు పెట్టుబడిదారీ,భూస్వామ్య ప్రభుత్వాలపై తిరుగుబాటు చేశాయి.

మార్క్స్‌ జీవనయానం:
1818 మే 5న ఐరోపా ఖండం జర్మనీలోని ‘‘ట్రయర్‌’’ నగరంలో కారల్‌ మార్క్స్‌ జన్మించాడు. తొమ్మిది మంది తోబుట్టువులలో మూడవవాడు ‘‘మార్క్స్‌’’. ‘‘ట్రయర్‌’’ నగరం ఫ్రెంచి విప్లవ ప్రభావం కలిగి నగరం. స్వేఛ్చా, స్వాతంత్య్రాల గురించి చర్చ సాగుతుండేది. ఆ ప్రభావం మార్క్స్‌ కుటుంబంపై వుంది.
17 ఏళ్ళ వయసుకు స్కూలు చదువు ముగించిన మార్క్స్‌ గురించి ప్రోగ్రెస్‌ రిపోర్టులో ఇలా వుంది. ‘‘అతడు చాలా తెలివిగల విద్యార్ధి. ప్రాచీన సాహిత్యంలోనూ, జర్మన్‌భాషలోనూ, చరిత్ర పాఠాల్లోనూ అత్యంత ప్రతిభ కనబరిచాడు. గణితంలో అమోఘమైన ప్రజ్ఞచూపాడు. ఫ్రెంచి భాష విషయంలో అంత పరిశ్రమ చేయనట్లుంది.’’ ఈ విధంగా స్కూలు చదువులోనే మార్క్స్‌ ప్రతిభా వంతుడుగా వున్నాడు.
వృత్తి ఎంపికలో యువకుని భావాలు అనే తొలి వ్యాసంలోనే మార్క్స్‌ ‘‘అత్యధిక ప్రజలకు అమిత సంతోషం కలిగించే వాడే నిజమైన అదృష్టవంతుడు’’ అన్నాడు. ఆవిధంగానే తన జీవిత సర్వస్వాన్ని ప్రజల శాస్పిత సంతోషానికి అంకితం చేసినవాడయ్యాడు. 1835 బెర్లిన్‌ విశ్వవిద్యాలయం నుండి ‘‘లా’’ పట్టాపొంది, 1839లో ‘‘డెమోక్రటిస్‌ ఎపిక్యురస్‌ తత్వాల మధ్య వ్యత్యాసం’’అనే ధీసిస్‌కు డాక్టరేట్‌ పొందాడు. ఆనాటి విప్లవభావాలను వంటబట్టించుకొన జర్మన్‌ తత్వవేత్త ‘‘హెగెల్‌’’ శిస్యుడుగా మారాడు. రాబర్డ్‌ఓపెన్‌, సెయింట్‌ సైమన్‌ రచనల అధ్యయనంతో సోషలిస్టుభావాలతో ముందడుగు వేశాడు. కొత్తభావాలతో పదునెక్కిన ఆయన ఒక ప్రగతిశీల పత్రికకు సంపాదకుడుగా మారి అనేక వ్యాసాలు ప్రచురించాడు. 1842లో ఎంగేల్సుతో పరిచయమై జీవిత పర్యంతం శ్రామికవర్గానికి నిజమైన మిత్రులుగా నిలబడ్డారు.
1843లో తను ప్రేమించిన ‘‘జెన్నీవేస్ట్‌ఫాలెన్‌’’ వివాహమాడాడు. నూతన పత్రికను ప్రారంభించటం కోసం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరాడు. ఫ్రాన్స్‌ విప్లవం కార్మివర్గానికి ద్రోహం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘వ్యక్తిగత ఆస్తిపై ఆధారపడిన వ్యవస్థ కార్మికుల శ్రమను దోచుకునే అవకాశం పెట్టుబడిదారులకిచ్చింది’’ అని విశ్లేషించాడు. 1846లో ‘‘జర్మన్‌ భావజాలం’’ అనే గ్రంధం ద్వారా నూతనసిధ్ధాంతమైన ‘‘చారిత్రక భౌతికవాద’’ సిద్ధంతం ప్రతిపాదించాడు.
‘‘ తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరివిధాల వ్యాఖ్యానించారు. అసలు విషయం దాన్ని మార్చటం’’ అని ప్రతిపాదించాడు . కార్మికవర్గ సిద్దాంతానికి శ్రీకారం చుట్టి పెట్టుబడిదారీ సిధ్దాంత సమర్దకులతో పోరాటానికి కార్మికుల కు ఆయుదం ఇచ్చాడు.
ప్రవాసుల లీగుతో ప్రారంభించి అంతర్జాతీయ కమ్యూనిస్టు సంఘం వరకు అనేక కార్మికవర్గ సంస్దలను నిర్మింనంలో మార్క్‌స్‌ ప్రధానపాత్ర నిర్వహించాడు. ఆకాలంల్లో జరిగినపోరాటాలన్నింటికీ మార్క్స్‌ మార్గదర్శి. సిద్ధాంతకర్త. ఎదురైన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. చారిత్రక భౌతికవాదం, వర్గపోరాటం, సోషలిస్టు విప్లవాల గురించి వివరణ ఇస్తూ ‘‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేవిూలేదు బానిస సంకెళ్ళుతప్ప’’ అనే పిలుపుతో ‘‘ కమ్యూనిస్టు ప్రణాళికను’’ ప్రపంచానికి ఇచ్చారు. అది ప్రపంచ కార్మికవర్గ నికి వెలుగుబాట చూపింది. యూరప్‌లో ని అన్ని విప్లవాల్ల అనుభవంనుండి మార్క్స్‌, ‘‘కార్మికవర్గానికి బలమైన కమ్యూనిస్టుపార్టీ నిర్మాణం’’ అవసరం అని పిలుపునిచ్చారు.
మార్క్స్‌ జీవితం కష్టాలతో సహవాసం‘క్లిష్టమైన నిరంతరం అధ్యయనం .
జర్మనీలో పుట్టి యూరప్‌లోని అనేక దేశాల నుండి బహిష్కరణకు గురై 1849 నుండి లండన్‌లో ప్రవాసిగా జీవితం గడుపుతూ చివరివరకు అక్కడే మరణించారు. దుర్భర దారిద్రంలో వుంటూకూడా కడవరకు కార్మికవర్గంతోనేలిచాడు. ప్రపంచంలో అతిపెద్ద గ్రంధాలయమైన లండన్‌ లోని బ్రిటీష్‌ మ్యూజియంలో 25 ఏళ్ళ వెచ్చించి పెట్టుబడిదారీ విధానాన్నం గుట్టు విపే ‘‘పెట్టుబడి’’ గ్రంధాం కార్మికవర్గం చేతిలో నూతన ఆయుధాన్ని వుంచాడు.
న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌కు వ్యాసాలు వ్రాస్తూ భారతదేశాన్ని గురించికూడా పరిశీలన చేశాడు. 1853లో 3 వ్యాసాలు, 1857 సిపాయిల తిరుబాటు అనంతరం ఎంగిల్స్‌తో కలసి 16 నెలల కాలంలో 28 వ్యాసాలు వ్రాశాడు. వలస దోపిడీ తీవ్రంగా ఖండిరచడమేకాక వలసాధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను బలపర్చాడు.
1883 మార్చి 14న కన్నుముసినాయన సమాధివద ఎంగెల్స్‌ చేసిన ప్రసంగం ‘‘మార్క్స్‌ అందరికంటె ఎక్కువగా ద్వేషించబడిన, నిందించబడిన వ్యక్తి. ప్రభుత్వాలు నియంతృత్వం, ప్రజాస్వామికం ఏపేర్లతో వున్నా తమ భూభాగాలనుండి ఆయన్ని బహిష్కరించాయి. బూర్జువాలు, మితవాదులు, అతివాదులు, ఆయనవిూద నిందలు గుప్పించడానికి పోటీపడ్డారు. అయినా ఆయన సైబీరియా నుండి కాలిఫోర్నియా దాకా యూరప్‌, అమెరికా ఖండాల్లోని సకలభాగాలలోని లక్షోపలక్షల విప్లవకార్మికులచేత ప్రేమించబడి, పూజింపబడి, వాళ్ళకు దుఖం కలిగిస్తూ మరణించాడు. ఆయనకు చాలా మంది వ్యతిరేకులున్నపటికీ వ్యక్తిగత శత్రువు ఒక్కరుకూడా లేరు. ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన కృషికూడా సఫలమౌతుంది.
ఈ దుర్మార్గపు దోపిడీ వ్యవస్ద సమర్దకులు మార్క్సిజం మరణించిందని వాదిస్తున్నానా ప్రపంచంలోని కార్మికులు, పీడిత వర్గాలు, తమ విముక్తికోసం మార్క్సిజం గురించి చర్చిస్తున్నారు. ప్రపంచం అంతా పోరాడే కార్మికుల నుండి పోప్‌ వరకూ ప్రస్తుతం సంక్షోభానికి కపరిష్కారంగా మార్క్స్‌ను అధ్యయనం చేస్తున్నారు. ఏప్పటికీ మార్క్సిజమే సమాజాన్ని ముందునడిపించగలమార్గం. మారుస్తున్న అధ్యయనం చేయడం మార్చు అనుసరించడం నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఉత్తమ పరిష్కారం ..సెల్యూట్‌ టు మార్క్స్‌

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *