గుంటూరు:హత్య కేసులో నిందితుడిని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేసారు. గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి హత్య జరిగింది. హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను(32)గా గుర్తించారు. ఒంగోలు నుంచి వలస వచ్చి గుంటూరు నగరంలోని కూలిపనులు చేసుకుంటూ లాడ్జిల్లో ఉంటూశ్రీను జీవనం కొనసాగిస్తున్నాడు. ఈస్ట్ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి నచికెట్ షెల్కే, లాలాపేట సిఐ పి.దేవ ప్రభాకర్ నిందితుడి యొక్క వివరాలు విూడియా ముఖంగా వెల్లడిరచారు. పని చేసుకొని తను తెచ్చుకున్న డబ్బులను తన దగ్గర నుంచి రోజు బెదిరించి శ్రీను లాకుండటంతో ఆగ్రహించిన బొమ్మగాని సతీష్ ఫిబ్రవరి నెల 25 అర్ధరాత్రి హత్య చేసినట్టు వెల్లడిరచారు. తోట శ్రీనుకి మద్యం త్రాగించి మద్యం మత్తులో వున్న శ్రీను నీ బండరాయితో తలవిూద మోది హత్య చేసినట్లుగా హంతకుడు బొమ్మగాని సతీష్ ఒప్పుకున్నాడని సిఐ వెల్లడిరచారు.