కడప: చుక్కల భూమి పరిష్కారం కోసం 50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్ లో సీ సెక్షన్ సూపరిండిరడెంట్ ప్రవిూల ఏసీబీకి చిక్కారు. వైయస్సార్ జిల్లా వీరపునాయని పల్లె మండలం వల్దుర్తి గ్రామానికి చెందిన వీరపుశేఖర్ 6 ఎకరాల పొలం చుక్కల భూమి కింద నమోదైంది. దానిని చుక్కల భూమి లిస్ట్ నుంచి తీసివేయడానికి అంప్లై చేసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో పైల్ ప్రవిూణ దగ్గరకు వచ్చింది. నీపని చేసిపెట్టాలంటూ లక్షా 50 వేల లంచంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. అందులో భాగంగా 50 వేల అడ్వాన్స్ గా ఇస్తూ ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు ట్రాప్ చేసి పట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచగొండి అధికారిని ఏసీబీ పట్టుకోవడంతో కలెక్టరేట్ లో పనిచేసే అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.