రాజమండ్రి, మార్చి 11: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో సస్పెన్ష్‌గా ఉన్న కందుల దుర్గేష్ వ్యవహారం ఇవాళ జనసేన తేల్చేసింది. ఆయన్ని నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. అక్కడ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటంతో కందుల దుర్గేష్‌ను నిడదవోలుకు మార్చారు.