అనంతపురం, మార్చి 11:తన కళ్ల ముందే భర్తను దారుణంగా హతమార్చడం చూసిన ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. అనంతపురంలోని జెఎన్‌?టీయు సవిూపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రిన్సిపల్‌?గా పని చేసిన మూర్తిరావు హత్యకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఇంట్లోనే ఉన్న మూర్తిరావును మేనల్లుడు ఆదిత్య గొంతు కోసి హత్య చేశాడు. మేనల్లుడు ఆదిత్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తిరావు డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మేనల్లుడు ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతు కోసి హత్య చేశాడు. సొంత కుటుంబ సభ్యుడి చేతిలోనే మూర్తిరావు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.మూర్తిరావు హత్య జరిగి 24 గంటలు గడవక ముందే తెల్లారి భార్య శోభ కూడా మృతి చెందారు. మూర్తిరావు భార్య శోభ గుండెపోటుతో తెల్లవారుజామున మరణించారు. కళ్ళ ముందే భర్త హత్య చూసిన భార్య శోభ అది తట్టుకోలేక తెల్లారి కల్లా గుండుపోటుతో మరణించారు. భర్త హత్యకు గురైన 24 గంటల్లోనే.. భార్య గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదన్న కక్షతో ఆదిత్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మూర్తిరావు మేనల్లుడు ఆదిత్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *