ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ : అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వి. సుందరరామరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిజెపి కాళ్ల దగ్గర పడి బిజెపికి వత్తాసు పలుకుతున్న వైసీపీ, టిడిపి జనసేన కూటమి లను చిత్తుగా ఓడించాలని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉందని, మరో రెండు నెలల జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్సభ అన్ని స్థానాలలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB ) పోటీ చేస్తుందని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.సుందరరామరాజు తెలిపారు.

శుక్రవారం రాయచోటిలోని లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత సాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. 1939 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పోటీలో నిలబడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి , దోచుకున్నా మరియు దాచుకున్న వాటిపైన ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆయన వాపోయారు. విభజన హామీల కోసం ఏ ఒక్క పార్టీ చిత్తశుద్ధిగా సాధించుకోవడంలో పనిచేయలేదని, ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ తో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవడం, తెరపైన నాటకాలు ఆడడం చేస్తున్నారని వారు విమర్శించరు రాష్ట్రంలో బూదందా, ఇసుక దందా, మైనింగ్ మాఫియా వంటి అరాచక పాలన కొనసాగుతుందని సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. దేశంలో నరేంద్ర మోడీ కాషాయీకరణ, కార్పొరేటీకరణ ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ప్రజల మధ్య విచ్చిన్నం బేధాభిప్రాయాలు కలగజేస్తూ, అభివృద్ధికి ఆటంకంగా మారారని వారు దుయ్యబాట్టారు. ఈ తరుణంలో మరో రెండు నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని శాసనసభ స్థానాలకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీ చేస్తుందని రాష్ట్రంలోని ప్రజలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి కాలేశా,రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్, జిల్లా శ్రీనివాసులు, పార్టీ కమిటీ సభ్యులు క,ఆలిండియా అగ్రగామి మహిళా సమితి కె. సుబ్బమ్మ, లక్ష్మి, హరిత, లలిత, అములు, జయమ్మ, యానాదమ్మా, జయసుధ, కుమారి, హరిప్రియ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకురాలకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాలతో సన్మానించి, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సుందరరామరాజు మాట్లాడుతూ…… మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాలలో ముందు ఉండాలని, మహిళా రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించి రాజకీయంగా మహిళ లోకం ముందుకు రావాలని, మహిళా హక్కులను సాధించుకోవడంలో స్వతంత్ర శక్తిగా ఎదిగి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *