కడప, మార్చి 8, (న్యూస్ పల్స్):వైఎస్ వివేకా కేసులో సీబీఐ ఛార్జిషీట్లు, సి.ఎం. జగన్, ఎం.పి. అవినాష్ రెడ్డి సహా వైఎస్ కుటుంబంవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢల్లీి ప్రెస్ విూట్ వైసీపీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే సొంత జిల్లా కడపలో సైతం వైసీపీ గెలుపు కష్టంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య ఎవరికి అవసరం అన్న కోణంలో ప్రచారాన్ని మార్చేందుకు వైఎస్ భారతి ఆధ్వర్యంలోని సాక్షి పత్రిక ఓ తప్పుడు కథనాన్ని వండివార్చింది. గతంలో వివేకా హత్యకు చంద్రబాబే కారణం అన్నట్లు నారాసుర రక్తచరిత్ర అంటూ కథనాలు రాసిన సాక్షి.. ఇప్పుడు తిరిగి అలాంటి పరిస్దితులే వచ్చేసరికి మరోసారి అదే ప్రచారం ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది.వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు విూడియాకు తెలిపారు.అనంతరం హత్యంటూ విూడియా సమావేశంలో టీడీపీ విూద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి ఆది నారాయణ రెడ్డి విూద తమకు అనుమానాలున్నాయని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.వైఎస్ వివేకానందరెడ్డికి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల వల్లే ఈ హత్య జరిగిందని అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.వివేకా మృతి కేసు విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.వివేకాది ‘మర్డర్ ఫర్ గెయిన్’(లబ్ధి కోసం హత్య).ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగిందా? అంటే.. లబ్ధి అవినాష్‌కు కలిగిందనేగా?!
అవినాష్ మాత్రం ‘మర్డర్ ఫర్ గెయిన్’ వివేకా కూతురుకు, అల్లుడికి అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సాక్షి పేపర్‌లో నింపేశారు. వివేకా ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారని, ఆమెకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని, అంతేకాకుండా.. వివేకా తన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని అవినాష్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో వివేకా ఆస్తులన్నీ ముస్లిం భార్య కుటుంబానికి వెళ్లిపోతాయని, రాజకీయ వారసులుగా వస్తారని భావించిన వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కుట్ర చేశారంటూ సాక్షి ప్రచారం చేస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారని, హత్య వెనుక ఆస్తి తగాదాలు ఉన్నాయని సాక్షిలో రాశారు.
అయితే.. ఈ ‘మర్డర్ ఫర్ గెయిన్’లో సందేహాలు అనేకం ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
1) వివేకా ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నది ఇప్పుడు కాదు. వైఎస్ హయాంలోనే ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత.. కోర్టు జోక్యంతో అందరికీ తెలిసిందే.
2) అప్పట్లోనే భరణం కింద.. ఆమెకు కొంత భూమిని ఇచ్చేశారు. సో.. ఈ విషయంలో ఆస్తి తనకు అవసరం లేదని ముస్లిం భార్య అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.
3) వివేకా హత్య తర్వాత.. ముస్లిం భార్య వచ్చి.. ఆయన పార్థివ దేహాన్ని చూసివెళ్లారు. ఆమె ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. మరి ఆమెకు లేని అనుమానాలు.. అవినాష్‌కు ఎందుకు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా.. వివేకా కేసు మాత్రం ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.కడప ఎంపీ సీటు హత్యకు దారి తీసిందనే గతంలో సీబీఐ వాదన వినిపించింది.
వివేకా హత్య కేసు: సీబీఐ తుది చార్జిషీట్
1. వివేకా హత్యకు వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ తెలిపింది. హత్యకు సంబంధించిన కుట్ర కోణాన్ని వెల్లడిస్తూ సీబీఐ తాజా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా,అనుమానితులుగా ఉన్న పలువురి పేర్లు,
వారి పాత్రను కూడా సీబీఐ పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను సమర్పించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసం విషయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి కూడా సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. హత్య కుట్ర విషయంలో మాత్రం ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపింది. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో వైఫై రూటర్ కు కనెక్ట్ అయిన ఫోన్లు, వాటి లొకేషన్లు తెలుసుకుంటున్నట్లు సీబీఐ పేర్కొంది. అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు నిన్ హైడ్రిన్ పరీక్ష చేశారు.గూగుల్ టేక్ అవుట్ ఆధారంగానే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని నిందుతులుగా పేర్కొంది. ‘’వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత సునీల్ యాదవ్ లేడు. 2019, మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, 8.12 గంటలకు ఇంటిలోపల ఉన్నాడు.వివేకా హత్య కేసు ఏపీ ఎన్నికల్ని శాసించబోతోందనుకోవచ్చు. సునీత కూడా ఢల్లీిలో ప్రెస్ విూట్ పెట్టి విూరీ చెప్పేశారు. అన్నకు ఓటు వేయవద్దని. 8 కోట్ల రూపాయల భూమి సెటిల్ మెంట్ కోసమో, లేక ఎంపి సీటు కోసమే వివాదం అయితే వుంది. ఆ వివాదం 2019 ఎన్నికలు, 2024 ఎన్నికల్లోనూ కీలకం కానుంది.