దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈసీ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుందోనని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సెకండ్‌ వీక్‌లో ఎప్పుడైనా రిలీజ్‌ కావచ్చనే అంచనాతో ఉన్నాయి.ఈ నేపథ్యంలో మార్చి 13న షెడ్యూల్‌ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించి మే నెల చివరి వారంలో ఫలితాలు వెల్లడిరచే అవకాశం ఉంది.ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈనెల 13న పర్యటన ముగుస్తుంది. అదే రోజు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశ ఉంది.పార్లమెంటు ఎన్నికలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక షెడ్యూల్‌ ప్రకటించడమే తరువాయి. మోదీ రాష్ట్రాల పర్యటన కోసమే ఈసీ షెడ్యూల్‌ ప్రకటించడం లేదని తెలుస్తోంది. 2019లో మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ ఏప్రిల్‌ 11 నుంచి 19 మధ్య ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది. ఈసారి కూడా దాదాపుగా అదే షెడ్యూల్‌ ఉండే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ఇచ్చి మే చివరి వారంలో ఫలితాలు ప్రకటిస్తుందని తెలుస్తోంది 6 నుంచి 8 దశల్లో ఎన్నికలు జరుగుతాయని సమాచారం.ఇక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. నీ ఈ నెల 11న ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌, ఇద్దరు కమిషనర్లు, పలువురు అధికారులు అన్ని రాష్ట్రాల్లోని సీఈఓలు, సెంట్రల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో అప్పటివరకూ షెడ్యూలు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు ఈ నెల 13న ప్రధాని మోడీ జమ్ము కశ్మీర్‌ పర్యటన ఉన్నందున అది ముగిసిన తర్వాతనే షెడ్యూలు విడుదలయ్యే అవకాశమున్నది. లోక్‌సభ ఎన్నికలతో పాటే జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నది.అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్లను ఖరారు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని సీఈఓ (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌) ఆఫీసుల్లో పనిచేస్తున్న సీఈఓ, అదనపు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, ఎలక్షన్‌ కమిషన్‌ తరఫున పనిచేస్తున్నవారికి ‘బ్రీఫింగ్‌ విూటింగ్‌’ నిర్వహించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 11న ఉదయం 9.00 గంటల నుంచే ఇది జరుగుతుందంటూ ఆయా రాష్ట్రాల తరపున హాజరుకావాల్సిన అధికారుల (ఐఏఎస్‌, ఐపీఎస్‌) జాబితాను పంపింది. ఆ ప్రకారం తెలంగాణ నుంచి 2012`15 మధ్య బ్యాచ్‌లకు చెందిన 13 మంది ఐఏఎస్‌ అధికారులు హాజరు కావాల్సిందిగా సర్క్యులర్‌ పంపింది. దీనికి తోడు పలువురు ఐపీఎస్‌ అధికారుల లిస్టును కూడా పంపింది. వీరంతా ఫిజికల్‌గా ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే విూటింగ్‌కు హాజరుకానున్నారు.సీఈఓ, అదనపు సీఈఓ, డిప్యూటీ సీఈఓ లాంటి సీనియర్‌ బ్యూరోక్రాట్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సాయంత్రం వరకూ ఇది కొనసాగనున్నందున ఈసీ నుంచి సూచనలు ఇవ్వడంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా అదనపు జాగ్రత్తలపైనా స్పష్టత రానున్నది. ప్రధాని జమ్ము కశ్మీర్‌ టూర్‌ ముగిసిన తర్వాత మాత్రమే షెడ్యూలు విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాల సమాచారం.మార్చి 13వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఆ లోపు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు పూర్తి కావాలని స్పష్టం చేశాను. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. లోక్‌ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. లోక్‌ సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది అని’ జమ్ము కశ్మీర్‌ ఎన్నికల అధికారి పీకే పోల్‌ వెల్లడిరచారు.త్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సహా 18కు పైగా రాష్ట్రాల్లో పర్యటించిన కమిషన్‌ విద్వేషపూరిత ప్రసంగాలు, ఉచితాలు, ఎన్నికల ఖర్చులకు వ్యతిరేకంగా అధికారులను హెచ్చరించారు. అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రమైన యూపీని సందర్శించిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌.. ఏదైనా అక్రమాలు జరిగితే, జిల్లా మేజిస్ట్రేట్‌, సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ లేదా పోలీసు సూపరింటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇంతకు ముందు కూడా కమిషన్‌ సందర్శించిన రాష్ట్రాల పరిపాలనా, పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన వైఖరి అవలంబించాలని కోరింది,గత లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లంఘనల రికార్డు ఆధారంగా జిల్లా మేజిస్ట్రేట్లు, సీనియర్‌ పోలీసు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించిన వివిధ రాష్ట్రాల్లోని జిల్లాలను కమిషన్‌ గుర్తించింది. అయితే ఈ వ్యవహారం కమిషన్‌కు చేరడంతోనే చర్యలు తీసుకున్నారు. అందువల్ల నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిమిషం కూడా జాప్యం జరగదని అధికారులతో జరిగిన సమావేశంలో కమిషన్‌ స్పష్టం చేసింది. అయితే ప్రధాన కేసుల్లో ముందుగా కమిషన్‌కు సమాచారం అందించి, ఆ తర్వాతే అధికారులపై ఎవరూ ఒత్తిడి తీసుకురాకుండా చర్యలు తీసుకుంటారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *