విజయవాడ:వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేసారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. ` వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వెల్లడిరచారు. ` చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా. ` ఇవాళ్టి జయహో బీసీ సభలోనే టీడీపీలో చేరతానని అన్నారు. ` కర్నూలు ఎంపీగా వెళ్లాలని జగన్ అడిగారు. ` కర్నూలు ఎంపీగా వెళ్లడం ఇష్టం లేదు. ` జగన్ విధానాలతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని అన్నారు. జగన్ గుడిలో శిల్పం మాదిరిగా తయారయ్యారు.` తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. ` సజ్జల, ధనుంజయరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని అన్నారు.