విజయవాడ, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. నోటిఫికేషన్‌ రాకుండానే ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే మహిళా కమిషన్‌ ఛైర్‌పర్శన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా. అసలు ఆమె ఎందుకు రాజీనామా చేశారు. దీని వెనుకు ఉన్న రాజకీయ కారణమేంటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్‌ చైర్‌పర్శన్‌గా చేశారు. ఆమె ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ సవిూకరణాలతో ఆమెకు టికెట్‌ దక్కలేదు. దీంతో ఈ పదవిని జగన్‌ అప్పగించారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్శన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా చూసుకున్నారు. ప్రభుత్వానికి మహిళలకు మధ్య వారదిలా నిలిచారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రాలు, దిశ చట్టం గురించి విస్తృతంగా ప్రచారం కల్పించారు. మహిళా కోటాలో ఈసారి వైసీపీ టికెట్‌ తనకు వస్తుందని చాలా బలంగా నమ్మారు వాసిరెడ్డి పద్మ. మైలవరం, జగ్గయ్యపేట రెండిరటిలో ఏదో ఒక చోట నుంచి తనకు టికెట్‌ వస్తుందని కూడా ఆశించారు. కానీ సవిూకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు టికెట్‌ ఇవ్వలేకపోయారు. దీనిపై కాస్త నొచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తన రాజీనామాకు పార్టీ టికెట్‌కు సంబంధం లేదని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చేందుకు, జగన్‌ను రెండోసారి సీఎంగా చేసేందుకే రాజీనామా చేసినట్టు వాసిరెడ్డి పద్మ చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని.. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కావాలన్నా… ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇవ్వాలన్నా పార్టీ వేదికే అందుకు కరెక్ట్‌గా వాసిరెడ్డి పద్మ  భావిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *