తిరుపతి: లేఖల వీరుడు హరిరామజోగయ్య కష్టపడి పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారు. ముద్రగడ, హరిరామజోగయ్యలు కాపులు ఇంకా అమాయకులు అనుకుంటూన్నారని జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. నెండ్రాకాయ్ కధలా ఇద్దరి వ్యవహారం ఉంది. పవన్ కళ్యాణి కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు. విూ లేఖలు మడిచి విూ దగ్గరే పెట్టుకోండి. ముప్పై ఎళ్ళ క్రితం కాపులు వేరు ఇప్పుడు ఉన్న కాపులు వేరు గుర్తుపెట్టుకొండి. కాపులకు బాగా రాజకీయాలు తెలుసుకున్నారు… ప్రజారాజ్యం టైం కాదు ఇది… విూ డ్రామాలు,వెన్నుపోటు రాజకీయాలు అందరికీ తెలుసు. ఇక సాగవు. కన్న కొడుక్కి సలహాలు ఇవ్వలేవు…కాని పవన్ మాత్రం లేఖలు రాస్తారా. కూమారుడికి హరిరామజోగయ్య మంత్రి పదవీ కావాలని, పవర్ షేరింగ్ కావాలని,నలబై సీట్లు కావలనే వైసిపికి లేఖ రాసే దమ్ముందా. పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తాం. ఎంత ఫ్యాకేజీ తీసుకుని వైసిపిలో వెళ్ళాడు విూ కోడుకు. అ లేఖలు అన్ని తాడేపల్లి గూడెం వస్తున్నాయని అన్నారు. .