బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప
మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప
బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు
విజయవాడ: మదనపల్లె కు చెందిన పారిశ్రామికవేత్త వల్లగట్ల రెడ్డప్ప బీజేపీలో చేరారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తి దగ్గుబాటి పురందేశ్వరి అయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తదితరులు పాల్గోన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోడీ అందిస్తున్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి సమ పాళ్లల్లో ఉండేలా మోడీ పాలన. పేద కుటుంబానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారు.. ఎస్టీ మహిళను రాష్ట్రపతి అయ్యారు.. ఇది బీజేపీతోనే సాధ్యం. సబ్‌ కే సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అనేది బీజేపీ లక్ష్యమని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *