`ఉచిత విద్యుత్‌,రూ.500 కి గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం పట్ల హర్షం
మంథని:గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా బుధవారం మంథని పట్టణములోని అంబేద్కర్‌ చౌరస్తాలో మంథని మండల, మంథని పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో చైర్మన్‌ గా దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు ఉండి పేద ప్రజల కు అందే పథకాల రూపొందించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళల అభ్యున్నతికి పాటు పడే పార్టీ అని ప్రజల ప్రభుత్వం అని అన్నారు. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ పట్ల మహిళలు హార్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించుకొని కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని అన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వ హయాంలో కరెంటు, గ్యాస్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయని మన కాంగ్రెస్‌ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టే 500 కి గ్యాసు, 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగిందని, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తీసివేయడం జరిగిందని నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలోమంథని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్‌, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పోలు శివ, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ ఓడ్నాల శ్రీనివాస్‌, డిసిసి ఉపాధ్యక్షుడు నూకల బానయ్య, డిసిసి కార్యదర్శి కుడుదల వెంకన్న, కౌన్సిలర్లు పెండ్రు రమాదేవి, శ్రీపతి బానయ్య, నాయకులు ఓడ్నాల ప్రవల్లిక,సుగుణమ్మ, బూడిద శంకర్‌, ఆర్ల నాగరాజు, వేల్పుల రాజయ్య, అజీమ్‌ ఖాన్‌, ఎరుకల ప్రవీణ్‌, ఆకుల శ్రీనివాస్‌, దొరగొర్ల శ్రీనివాస్‌, మంథని సురేష్‌, టి రాజు, చంద్రు రాజమల్లు, జనగామ సడువలి, కూర కోటేష్‌, ఆరెల్లి కిరణ్‌ గౌడ్‌, మంతెన శ్రీనివాస్‌,కాంగ్రెస్‌ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *