పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడిరది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్‌ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాల రాకకు ఇంకా మూడు నెలల సమయం వున్నప్పటికీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 2024లో మార్చి నుంచి మే నెలల మధ్య సూపర్‌ ఎల్‌ నినో ప్రపంచాన్ని దెబ్బతీసే సూచనలున్నాయి.అమెరికాకు చెందిన ఎన్‌ఓఏ(నేషనల్‌ ఓషెనిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) సూపర్‌ ఎల్‌ నినో వచ్చే అవకాశం ఉందిన కొద్దిరోజుల కిందట అంచనా వేసింది. మార్చి నుంచి మే వరకూ వేసవి కాలం. ఈ కాలంలోనే ఎల్‌ నినో అత్యంత తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.ఎన్‌ఓఏ చేసిన వాతావరణ సూచనల ప్రకారం, 2024 మార్చి నుంచి మే నెలల మధ్య సూపర్‌ ఎల్‌ నినో ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తీవ్రమైన ఎల్‌ నినో కనిపించే అవకాశం 70 నుంచి 75 శాతం వరకూ ఉన్నట్లు అంచనా వేసింది.ఆ సమయంలో భూమధ్యరేఖ సవిూపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశం ఉంది.ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 శాతం ఉష్ణోగ్రతలు పెరిగినా అది 30 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లే.1972?73, 1982?83, 1997?98 మరియు 2015?16లోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అనేక దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కరవు, వరదల వంటి విపత్తులను ఎదుర్కొన్నాయి.ఎల్‌నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్‌నినో వల్ల శీతాకాలాలు కూడా వెచ్చగా ఉంటాయి. వర్షం లేకుండా వేసవి కాలం మరింత వేడిగా మారనుంది. ఇక అవి మాత్రమే కాదు, దాని వల్ల రుతుపవనాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. గత 20 ఏళ్లలో సంభవించిన కరవులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే సంభవించాయని ఎంకె గ్లోబల్‌ పరిశోధనా నివేదిక చెబుతోన్న క్రమంలో ఈ సంవత్సరం వ్యవసాయోత్పత్తులు తక్కువగా ఉండవచ్చని అంటున్నారు. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని పరిశోధన నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఎల్‌నినో ప్రభావం 55 నుండి 60 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఎల్‌నినో, లానినా అనేవి వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి అనే సంగతి చాలా మందికి తెలుసు. కానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి క్లారిటీ లేదనడం అతిశయోక్తి కాదు. ఎల్‌నినో అంటే వర్షాభావ పరిస్థితి కాగా, లానినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి అనే ఒక్క మాటలో చెప్పే వివరణ.ఎల్‌నినో అంటే పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్‌ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్‌నినో అనేది ఒక స్పానిష్‌ (లాటిన్‌) పదం. లాటిన్‌ భాషలో ఎల్‌నినో అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది. మూడేళ్ళుగా పసిఫిక్‌పై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్‌తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో భారత్‌లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం హెచ్చరించింది. దీని వల్ల భారత్‌ సహా చాలా దేశాల్లో కరవు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది.ఎల్‌నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్‌నినో విభిన్నమైందే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్‌నినోతో వరదలు, కరవులు సంభవించడమే కాదు వాతావరణం వేడెక్కడం మరో సమస్య. పసిఫిక్‌ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్‌నినో సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమిదే.ప్రపంచంలోనే అతిపెద్దదైన పసిఫిక్‌ మహా సముద్రంలో బలంగా వీచే గాలులు, వాటి దిశ, ఉష్ణోగ్రత వంటి అంశాలు మొత్తం ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయవాతావరణంలో ఎల్‌ నినో ప్రభావం ఉన్నప్పుడే భారత్‌లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి.అదే తరహాలో, ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో దేశంలో కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.భారత్‌లో వర్షపాతానికి, ఎల్‌ నినోకు అవినాభావ సంబంధం ఉన్నట్లు విూడియా నివేదికలతో అర్థమవుతోంది. ఎందుకంటే, 1981 నుంచి ఇప్పటి వరకూ దేశంలో తలెత్తిన కరవు పరిస్థితులు 6 ఎల్‌ నినోల కాలంలోనే జరిగాయి. చివరగా 2002, 2009 కరవు పరిస్థితుల సమయంలోనూ ఎల్‌ నినోలు చురుగ్గా ఉన్నాయి.అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత్‌లో కరవు పరిస్థితులు తలెత్తినప్పుడు ఎల్‌ నినో దాదాపుగా యాక్టివ్‌గా ఉంది. కానీ, ఎల్‌ నినో యాక్టివ్‌గా ఉన్న ప్రతి ఏటా భారత్‌లో కరవు పరిస్థితులు ఏర్పడలేదు.ఉదాహరణకు, 1997 ` 98లో ఎల్‌ నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ దేశంలో కరవు పరిస్థితి లేదు.ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్‌ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఈ ఎల్‌నినో, లానినాలకు కారణం అవుతాయని అంచనా. పసిఫిక్‌ మహాసముద్రంలో, సాధారణ పరిస్థితుల్లో, గాలులు భూమధ్యరేఖ ద్వారా పశ్చిమంగా వీస్తాయి. అలా జరగడం వలన దక్షిణ అమెరికా నుండి వెచ్చని నీరు ఆసియా వైపు వస్తుంది. సముద్రపు లోతుల నుండి పైకి వచ్చే చల్లటి నీరు వెచ్చని నీటితో ప్రవహించే ఖాళీ స్థలాన్ని నింపుతుంది. అలాంటి ప్రాసెస్‌ను అప్‌వెల్లింగ్‌ అంటారు. ఎల్‌ నినో సహా లానినా ఈ పరిణామాన్ని నాశనం చేస్తాయి. మన దేశానికి లానినా ప్రభావం మంచిసూచన, అదే ఎల్‌నినో ప్రభావం ఉంటే జూన్‌ అక్టోబర్‌ మధ్య భారత దేశంలో రుతుపవనాలు ప్రభావితమవుతాయని అంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *