హైదరాబాద్‌ ఫిబ్రవరి 26: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. ఈ నెల 27న చేవెళ్ల నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పర్యటన ఉండే. పర్యటనలో భాగంగా ప్రియాంక సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెండు పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ ఆమె పర్యటన రద్దు కావడంతో వర్చువల్‌ విధానంలో ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు.రూ. 500లకు గ్యాస్‌ సిలిండ్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ను ప్రియాంక గాంధీ చేతుల విూదుగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రియాంక పర్యటన రద్దు అయింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *