హైదరాబాద్, ఫిబ్రవరి 26: గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ…. కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతంతో పోల్చితే… పోస్టులను సంఖ్యను పెంచుతూ మొత్తం 563 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఖాళీల వివరాలతో పాటు సిలబస్ ను కూడా వెల్లడిరచింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల సిలబస్ లోని అంశాలను స్పష్టంగా పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్షా విధానం, సిలబస్ ఎలా ఉందో ఇక్కడ చూడండి…
గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి. రెండో దశలో మెయిన్స్ ఉంటుంది.
1. ప్రిలిమినరీ ఎగ్జామ్
2. మెయిన్ ఎగ్జామినేషన్
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తినే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకొని నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లీష్ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయించారు.
గ్రూప్ 1 సిలబస్ ` ప్రిలిమ్స్
ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే…జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలీటీ ఉంటుంది. జనరల్ స్టడీస్ లో భాగంగా… సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు(జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ) ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్, ఇన్విరాన్ మెంటర్ స్టడీస్, భారత దేశ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సాహిత్యం, కళలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఇక మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 150 మార్కులు కేటాయించారు. వ్యవధి 3 గంటలుగా ఉంటుంది. పేపర్ `1 లో జనరల్ ఎస్సే 150 మార్కులకు ఉంటుంది.
:ఎ: జనరల్ ఎస్సే
:ఎ: చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
:ఎ ? ఇండియన్ సొసైటీ, భారత రాజ్యాంగం, పరిపాలన వ్యవహారాలు
:ప ? భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
: ప ? సైన్స్ అండ్ టెక్నాలజీ
:ఎ ` తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం