కడప: రాష్ట్ర ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా శనివారం వేడెక్కింది. టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో కడప అన్నమయ్య జిల్లాలో అలజడి రేగుతొంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నలుగురు టిడిపి అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత ప్రకటించడంతో ఆశావహులలో ఆగ్రహవేషాలు పెరిగిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో నలుగురు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ పార్టీలోఅసమతి సెగలు ఎగిసిపడుతున్నాయి . ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కడప అభ్యర్థిగా రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, పులివెందుల ఇన్చార్జి బీటెక్‌ రవి పేరుతో పాటు అన్నమయ్య జిల్లాలోని రాయచోటి అభ్యర్థిగా మడిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్లను పేర్లను ప్రకటించారు. అయితే దీంతో ఆశవహులైన ఇతర నేతలు అసంతృప్తిని… అగ్రహ ఆవేశలను వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో ప్రస్తుత రాయచోటి ఇనీచార్జ్‌ రమేష్‌ రెడ్డి వర్గం నేతలు ఒక అడుగు ముందుకేసి పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. అంతేకాదు పట్టణలో ఆందోళనకు దిగారు. ఒకటి రెండు రోజుల్లో రమేష్‌ రెడ్డి టీడీపీ కి రాజీనామా చేసెందుకు సిద్దమయ్యారు. ఈయన బాటలోనే మరో ఆశ వహుడైన గడికోట ద్వారకనాధ రెడ్డి కూడా పయనించే అవకాశం ఉంది. వీరితో పాటు టిక్కెట్‌ ఆశించిన ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్‌ బాబు కూడా అలక వహించారు.
ఇక కడప నియోజకవర్గనికి వస్తే టీడీపీ అభ్యర్థిగా మాధవి రెడ్డిని ప్రకడిరచడంతో ఇక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్నా అవిూర్‌ బాబు, అలంకానపల్లి లక్ష్మీరెడ్డీ, జనసేన నేత సుంకర శ్రీనివాస్‌ లు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. తాము ఎటువంటి పరిస్తుతుల్లో సహకరించేది లేదని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ప్రధానంగా జనసేన నేత సుంకర శ్రీనివాస్‌ తెలుగుదేశం పార్టీ లో ఉన్నఅంతర్గత విబేదాల కారణంగా తమకు సీటు కేటాయిస్తారని ఇప్పటివరకు దీమాగా ఉన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. ఉమ్మడి జిల్లాలో ఆశవహు లలో చెలరేగిన అలజడి ఏపరిణామలకు దారి తెస్తుందో వేచి చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *