కడప, ఫిబ్రవరి 24: చావుకు తెగించినోడు దేనికైనా సిద్ధం అంటాడు..అదే పంథాలో పోతున్నాడు వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌ గా మారిన నిందితుడు దస్తగిరితాను ఎవరికి భయపడేది లేదని…పులివెందులో ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇంటికి సవిూపంలోనే ఉంటున్నాని ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్‌ విసిరారు. రాజీకి రావాలని వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉందన్న ఆయన….వివేకా హత్య లో పాల్గొని తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయదల్చుకోలేదని దస్తగిరి తెలిపాడు.వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, అప్రూవర్‌ గా మారిన దస్తగిరి వివిధ కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లి నాలుగు నెలల తర్వాత బెయిల్‌ పైవిడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కీలక ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని సానుభూతితో జగన్‌ ఎన్నికల్లో గెలుపొందారని.. ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యర్రగుంట్ల, వేముల పోలీసులు పెట్టిన అట్రాసిటీ, దాడి కేసుల్లో బెయిలు మంజూరు కావడంతో జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి కడప జైలు అతిథిగృహంలో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులకు వెళ్లారు. వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే.. వైకాపా పెద్దలు కుట్ర పన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపించారని దస్తగిరి విూడియాకు వెల్లడిరచారు. జైల్లో ఉన్న సమయంలోనే వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారన్నారు. డబ్బు ఆశచూపి రాజీకి రావాలని అభ్యర్థించారని పేర్కొన్నారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభపెట్టారన్న దస్తగిరి.. అప్రూవర్‌ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టు వెల్లడిరచారు.అయితే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయితే తాను పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వద్దనే నివాసం ఉంటున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. వివేకా విషయంలో తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, మరోసారి తప్పు చేయదల్చుకోలేదన్నారు. చావడానికైనా సిద్ధమే కానీ, జగన్‌, అవినాష్‌కు తలొగ్గనని స్పష్టం చేశారు. వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే కొందరు పెద్దలు కుట్ర పన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపించారని ఆరోపించారు దస్తగిరి. చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. వారిద్దరూ పులివెందులలో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారని హెచ్చరించారు. సిద్ధం సభల్లో వివేకాను హత్య చేసిందెవరో జగన్‌ చెబితే బాగుంటుందని సంచలన వ్యాఖ్యల చేశారు. ఇన్నాళ్లు నోరు విప్పని దస్తగిరి ఇప్పుడు ఏకంగా జగన్‌ కు ఎంపీ అవినాష్‌ రెడ్డికి సవాల్‌ విసరడం జిల్లాలో సంచలనంగా మారింది. వివేకాను ఎవరు చంపారో సిద్ధం సభల్లో జగన్‌ కు చెప్పే ధైర్యం ఉందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు చర్చించుకుంటున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *