విజయవాడ, ఫిబ్రవరి 24:పీలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ? జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీట్ల పంపకం, నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం శనివారం ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తారని అన్నారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో క్లారిటీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్‌ వల్ల ఏపీ బ్రాండ్‌ డామాలిష్‌ అయిందని, ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిరదని చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొదలుకొని నా వరకు, పవన్‌ కల్యాణ్‌ వరకు భరించామని, రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనే మా ప్రయత్నం అని చంద్రబాబు చెప్పారు. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్‌ పాలన ప్రారంభమైందని అన్నారు. పవన్‌ కల్యాన్‌, నేను మంచి అభ్యర్థులను ప్రకటించామని, రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంతగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేశామని చెప్పారు. 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, ప్రజల, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత, మంచి అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు. యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని, 28 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ , 51 మంది గ్రాడ్యుయేట్స్‌ ఉన్నారని అన్నారు.మొత్తం 118 సీట్లతో టీడీపీ`జనసేన తొలి జాబితా రిలీజైంది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. అలాగే మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను నేడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *