కడప జిల్లా ఖాజీపేట మండలం వద్ద రెండు కార్లలో లోడ్ చేస్తున్న 9ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని. ముగ్గరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ జి.చెంచుబాబు అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవికి చెందిన ఆర్ఎస్ఐ మురళీదర్ రెడ్డి టీమ్ గురువారం కడప టాస్క్ ఫోర్సు సబ్ కంట్రోల్ నుంచి బయలు దేరి ఖాజీపేట, బద్వేలు వైపు వెళుతుండగా, ఖాజీపేట సెక్షన్ పత్తూరు ఫారెస్ట్ బీటు పరిధిలో నాగపట్నం రోడ్డు, పత్తూరు సమాధుల వద్ద రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అక్కడకు చేరుకోవడంతో కారు దగ్గర ఉన్న వారు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు వ్యక్తులను పట్టుకోగలిగారు. వారిలో ఒకరు కానిస్టేబుల్ ప్రసాద్ ను గాయపరిచాడు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన సుందరవేల్ కుప్పన్(30), పార్తీబన్ మురుగన్ (30), కృష్ణగిరి జిల్లా రమేశ్ మునియప్ప (43)లుగా గుర్తించారు. కారులో లోడ్ చేసిన 5ఎర్రచందనం దుంగలు, కింద పడి ఉన్న మరో 4ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఫోర్టు కారు (పీవై01బీఎం 4846), రినాల్డ్ డస్టర్ (టీఎన్20సీడీ 5656) కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. ఎస్ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.