వైయస్సార్‌ `వాహన మిత్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు వందలు, వేల కోట్లు దోచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు కొన్ని లక్షల కోట్లు రూపాయలు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ తేడాను అందరూ గమనించాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగిన వైయస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్‌ బోర్డు ఎస్‌ వి ఆర్‌ సర్కిల్‌ వద్ద తాడేపల్లిగూడెం మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ డి.ఎస్‌.ఎస్‌. నాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఆటో డ్రైవర్లు కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారికోసం వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అంతవరకు ఆటో కార్మికులు ప్రతిరోజు ఆటో నడపడం ద్వారా వచ్చే అరకొర ఆదాయం వారి కుటుంబాల పోషణకే సరిపోయేదని, ఇక ఆటో నిర్వహణ మరమ్మత్తులు, వివిధ రకాల రుసుములు చెల్లించటానికి ఆటో కార్మికులు అప్పులు పాలు అయ్యేవారనీ మంత్రి కొట్టు గుర్తు చేశారు. అటువంటి పరిస్థితుల నుంచి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అన్నారు. దీనివలన ఆటో కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయన్నారు. రోజువారి వచ్చే డబ్బులతో కుటుంబ పోషణ వెళ్లగా ఏడాదికి ఒకసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వైయస్సార్‌ వాహన మిత్ర ద్వారా ఇచ్చే పదివేల రూపాయలు వారి ఆటో నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడుతున్నాయని మంత్రి కొట్టు పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా ఈ సంవత్సరం పదివేల రూపాయలు ఇవ్వడం ద్వారా వైయస్సార్‌ వాహన మిత్ర పథకంలో అర్హత కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ద్వారా 50 వేల రూపాయలు మొత్తం ఆర్థిక లబ్ధి చేకూరింది అన్నారు.
ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తాన్ని వివిధ సంక్షేమ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి డి బి టి ద్వారా వారి వారి ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారన్నారు. 2019 కి ముందు ఈ డబ్బంతా ఏమైపోయిందనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చేవారని విమర్శించారు. అలాగే అనేక కుంభకోణాలకు పాల్పడి కొన్ని వందల,వేల కోట్లు దోచుకుని దాచుకున్నారని డిప్యూటీ సీఎం కొట్టు ఆరోపించారు. అందులో భాగంగానే స్కిల్‌ స్కాం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాం, రాజధాని భూములు స్కాం, ఫైబర్‌ నెట్‌ స్కాం…. ఇలా ఒక్కొక్కటిగా అనేక రకాల కుంభకోణాలు బయట పడుతున్నాయి అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలతో నమ్మించి ప్రజలను మోసం చేసి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత హావిూలు ఎగ్గొట్టడం, నమ్మి అధికారాన్ని ఇచ్చిన ప్రజలను వంచించడం, కుంభకోణాలకు పాల్పడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. 2014లో మారిన మనిషిని అని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత రుణమాఫీ హావిూలను ఎగ్గొట్టి రైతులు, డ్వాక్రా మహిళలకు తీరని అన్యాయం చేశాడని విమర్శించారు. అంతకుముందు పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో అధికార దాహం, ధన దాహంతో ఉన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే స్కిల్‌ స్కామ్‌ కు పాల్పడి 371 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. నాటి తెలుగుదేశం పాలనకు నేడు వైకాపా పాలనకు నాటి చంద్రబాబుకు నేడు జగన్మోహన్‌ రెడ్డికి తేడాను ప్రతి ఒక్కరు గమనించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనంతరం వైయస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు 1 కోటి 28 లక్షల 40 వేల రూపాయలు చెక్కును అందజేసి, జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హౌసింగ్‌ బోర్డు ఎస్‌ వి ఆర్‌ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ఆటోలు, చిన్న కార్లు ర్యా,లీ తాడేపల్లిగూడెం లోని ప్రధాన రహదారి విూదుగా పెంటపాడు వరకు కొనసాగింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *