విశాఖపట్నం:మన రాజధాని హైదరాబాద్ అని ఎందుకీ ఈ ప్రకటన. నాలుగో రాజధానిగా హైదరాబాద్ అనడం వెనుక కుట్ర వుందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమే. మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హైకోర్టులో అమరావతి రాజధాని అని ఈ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాప్ లో అమరావతి రాజధాని అని ధృవీకరించారు. విశాఖలో మధ్య తరగతి బ్రతుకుల్ని అతలాకుతలం చేశారు. స్వంత ఇల్లు కొనుక్కొని పరిస్థితిలో వున్నారు. అమరావతిని ఎందుకు అభివృద్ధి కార్యక్రమనీ చెయ్యలేదు. జగన్ ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. ప్రభుత్వానికి జగన్ ప్రోప్రయటర్ గా భావిస్తున్నారు. మిగతా అందర్నీ బానిసలుగా చూస్తున్నారు. వైస్సార్ విూద నమ్మకంతో ఎవరికి ఇవ్వని మెజార్టీ ప్రజలు ఇచ్చారు. బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు, ఓ అటెండర్ చాలదా అని అన్నారు.
జగన్ ఎక్కడికొస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ లు ఎందుకు. పైన హెలికాప్టర్ లో వెళ్తే క్రింద ట్రాఫిక్ ఆపేస్తారు. జగన్ అంత నియంత ఎవరూ లేరు. సచివాలయంకు ఎందుకు వెళ్ళలేదు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకంగా ఒక్క పోరాటం చెయ్యలేదు. విశాఖలో కొండల్ని నమిలి మ్రింగేశారు. రాష్ట్రంలో ఇసుక దోచేశారు, ఆఖరికి సముద్ర సాండ్ ని కొట్టేసే స్కెచ్ వేశారు. ఋషికొండను కూల్చేసిన జగన్ కి వేంకటేశ్వరుని దర్శనం లేదు. జగన్ కు డబ్బు డబ్బు యావ పెరిగిపోయింది. హ్యూమన్ టచ్ లేని వ్యక్తి జగన్. మిగిలిన 60 రోజులైనా జగన్ మనిషిగా బ్రతకాలని అన్నారు.
అద్వితీయమైన విజయం ఇస్తే ఇంకా ఎంపీ సీట్లు కావాలనడం తప్పు,. నా జీవితంలో నేను చేసిన ఏకైక తప్పు వైసీపీలో చేరడమే. అవినీతి పాలన వుండదంటే పార్టీలో చేరాను. ప్రజలు నరకం చూస్తున్నారని జగన్ కే స్వయంగా చెప్పాను. ఏంటన్నా అని ఇంచార్జ్ సుబ్బారెడ్డిని అడిగారు. ఇంకోసారి జగన్ వస్తే రాష్ట్రంలో ఉన్నోళ్లు ప్రక్క రాష్ట్రానికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని అయన అన్నారు.