విజయవాడ, ఫిబ్రవరి 14:ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఏడాదికి సంబంధించిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్ట్` అఇు) షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 14న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 13 నుండి 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (ఇంఖఅఇు) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ (ఇఅఇు) పరీక్షను మే 8న నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 6న ఐసెట్ (ఎఅఇు), మే 29 నుండి 31 వరకు పీజీఈసెట్ (ఖఉఇఅఇు) పరీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 8న ఎడ్‌సెట్ (ఇఆఅఇు), జూన్ 9న లాసెట్(ఒంచిఅఇు), జూన్ 3 నుండి 7 మధ్య పీజీసెట్ (ఖఉఅఇు) పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్ 13న ఏడీసెట్ (ంఆఅఇు) పరీక్ష నిర్వహించనున్నారు. పీఈసెట్ (ఖఇఅఇు ) పరీక్ష తేదీ వెల్లడిరచాల్సి ఉంది. అయితే ఏదైనా కారణాల రీత్యా ఈ తేదీల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని ఉన్నత విద్యా మండలి తెలిపింది.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు..
? ఏపీఈఏపీసెట్ (ంఖ ఇంఖఅఇు)`2024 పరీక్ష: 13.05.2024 ` 19.05.2024.
? ఏపీ ఈసెట్ (ంఖ ఇఅఇు)`2024: 08.05.2024.
? ఏపీ ఐసెట్ (ంఖ ఎఅఇు)`2024: 06.05.2024.
? ఏపీ పీజీఈసెట్ (ంఖ ఖఉఅఇు)`2024: 29.05.2024 ` 31.05.2024.
? ఏపీఎడ్‌సెట్ (ంఖ ఇఆఅఇు)`2024: 08.06.2024.
? ఏపీ లాసెట్ (ంఖ ఒంచిఅఇు)`2024: 09.06.2024.
? ఏపీ పీజీసెట్ (ంఖ ఖఉఅఇు)`2024: 03.06.2024 ` 07.06.2024.
? ఏడీసెట్ (ంఆఅఇు)`2024: 13.06.2024.
? ఏపీపీఈసెట్ (ంఖ ఖఇఅఇు)`2024 పరీక్ష తేదీ ప్రకటించాల్సి ఉంది.
తెలంగాణ ఉమ్మడి పరీక్షల షెడ్యూలు ఇలా..
హైదరాబాద్,. ఫిబ్రవరి 14:తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు జనవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌తోపాటు ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్ ఎంసెట్ పేరును ‘టీఎస్ ఈఏపీసెట్’గా మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 6 ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. టీఎస్‌ఈఏపీసెట్, పీజీఈసెట్‌లను జేఎన్టీయూహెచ్‌కు, ఐసెట్ కాకతీయకు, ఈసెట్, లాసెట్‌లను ఉస్మానియాకు, ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్‌ను శాతవాహన వర్సిటీకి కేటాయించింది. ఈఏపీసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ దీన్ కుమార్ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్ను ఈసెట్ కన్వీనర్గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా నరసింహాచారి. పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ మృణాళిని నియమితులయ్యారు