విజయవాడ, ఫిబ్రవరి 14:ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కానీ చిరంజీవి అడ్డుపడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో విూడియాతో మాట్లాడిన ఆయన పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తరవాత రోశయ్యను సీఎంను చేశారు. రోశయ్య తాను పదవిలో కొనసాగలేనని చెప్పిన తర్వాత.. పార్టీ నేతలు చాలా మంది సీఎం పదవి కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో .. సీనియర్‌ మంత్రిగా పీసీసీ చీఫ్‌గా ఉన్నా బొత్స సత్యనారాయణ తనకు సీఎం పోస్ట్‌ వస్తుందనుకున్నారు. అనూహ్యంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సీఎంగా నియమించారు. ఆ సమయంలో తెర వెనుక ఏం జరిగిందో బొత్స సత్యనారాయణ ఇప్పుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీఎం పదవి కోసం జరిగిన చర్చల్లో ప్రజా రాజ్యం పార్టీని కూడా పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణకు చిరంజీవి మద్దతుగా నిలువలేదని తెలుస్తోంది. అందుకే తనకు సీఎం పదవి రాలేదని.. చిరంజీవి అడ్డుపడ్డారని బొత్స అంటున్నారని భావిస్తున్నారు. అప్పటికే కాంగ్రెస్‌ లో ప్రజారాజ్యం విలీనం కాలేదు. తర్వాత తానే చిరంజీవికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానని బొత్స చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో చేరకపోయి ఉంటే కాంగ్రెస్‌లో చేరకపోయి ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవారు బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు బొత్స ఎందుకు హఠాత్తుగా చిరంజీవి పేరు తీసుకు వచ్చి తనను సీఎం కాకుండా అడ్డుకున్నారని.. కాంగ్రెస్‌లో కలపకుండా ఉంటే..సీఎం అయ్యే వారని వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్న సందేహాలు రాజకీయవర్గాల్లో ప్రారంభయ్యాయి. చిరంజీవి తన పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ను పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన ఎక్కడా రాజకీయ పరమైన కామెంట్లు చేయడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి సమయంలో బొత్స .. చిరంజీవి ప్రస్తావన తీసుకువచ్చి తనకు ఏదో అన్యాయం చేశారన్నట్లుగా మాట్లాడటం.. ప్రజా రాజ్యం పార్టీ విలీనం గురించి చెప్పడం రాజకీయ వ్యూహమేనని అంటున్నారు. బొత్సకు ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.. చిరంజీవి కూడా తాను ప్రజా రాజ్యం అధ్యక్షుడిగా ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. బొత్సకు సపోర్టు చేయాలా లేదా అన్నదానిపై ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. బొత్సను సీఎం చేయాలని చిరంజీవి లక్ష్యంగా పెట్టుకుని ఉండరు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఇప్పుడు మరో కోణం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *