శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి యాత్ర`2 సినిమా తీశారు. వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయింది. డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా.. ఎవరు వెళ్లట్లేదు. నిజానికి జగన్ ఒక సైకో.. భస్మాసురుడు. జగన్ అంటే జైలు.. బాబు అంటే ఒక బ్రాండ్. బాంబులకే భయపడని కుటుంబం మాది. పనికిమాలిన కేసులకు భయపడతామా? అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్ కు సవాల్ చేస్తున్నా. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు పెడుతున్నారు . నీ సొంత చెల్లిల్లే నిన్ను నమ్మటం లేదని అన్నారు.
జగన్ చెప్పేవన్నీ అసత్యాలే. రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే జగన్ పని. ఎన్నికల ముందు జగన్ తియ్యగా మాటలు చెప్పారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. నిరుద్యోగులు అధైర్యపడవద్దు. రెండు నెలలు ఓపిక పట్టండని అన్నారు.