విజయవాడ: వైఎస్సార్‌ 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే, వారసుడు గా చెప్పుకొనే జగన్‌ ఆన్న 6 వేలతో వేసింది ‘‘దగా డీఎస్సీ’’. ప్రశ్నిస్తే వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఏపీసీసీ ఛీఫ్‌ షర్మిల అన్నారు. వీళ్ళను మోసే సోషల్‌ విూడియాకు ఒక సవాల్‌. 2019 ఎన్నికల్లో హావిూ ఇచ్చినట్లు 25 వేల టీచర్‌ పోస్టుల భర్తీ ఎక్కడ ? 5 ఏళ్లు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ? ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి. టెట్‌,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్‌ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్‌ అవ్వాలి ? నోటిఫికేషన్‌ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్‌ కి 20 రోజులు,తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధి నా ?
వైఎస్సార్‌ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌ కి గుర్తులేదా ? ఇచ్చిన సిలబస్‌ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని విూకు తెలియదా ? ఒక రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ? మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? నవ రత్నాలు,జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్‌ ఆన్న, ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *