అమరావతి ఫిబ్రవరి 12:అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ రోజు (సోమవారం) ఉదయం స్పీకర్ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్యేలుగా నోటీసులు అందించినప్పటికీవిచారణకు వెళ్లలేదు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. తాము వివిధ కారణాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. తాము అనారోగ్యకారణాల దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్టు ఒకరిద్దరు లేఖలు రాశారు. కాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఉదయం పూట, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం పూట విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపించినవిషయం తెలిసిందే.