వరంగల్‌: తెలంగాణ ఛత్తీస్‌ ఘడ్‌ సరిహద్దు భారీ ఎన్‌ కౌంటర్‌ తృటిలో తప్పింది. ఘటనస్థలంనుంచి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకుంది. పేరూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ ప్రారంభించారు. తెలంగాణ ఛత్తీస్‌ ఘడ్‌ రెండు రాష్ట్రాల స్పెషల్‌ పార్టీ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన మావోలు పారిపోయారు. పారిపోయిన వారిలో పుల్లూరి ప్రసాద్‌ అలియాస్‌ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, బండి ప్రకాష్‌ అలియాస్‌ బండి దాదా క్రాంతి, మైలారపు అడేలు అలియాస్‌ భాస్కర్‌ , కొయ్యడ సాంబయ్య అలియాస్‌ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేష్‌ ఉన్నట్లు ప్రకటించిన ములుగు ఎస్పీ గౌస్‌ ఆలం వెల్లడిరచారు. సంఘటన స్థలం నుంచి కిట్‌ బ్యాగులు, ఆలివ్‌ గ్రీన్‌ డ్రెస్‌ లు, సుతిల్‌ బాంబు, రేడియోలు, సోలార్‌ ప్లేట్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమతెరలు, మావోయిస్టు విప్లవ సాహిత్యం, మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడిరచారు. శుక్రవారం ఉదయం వరకు సోదాలు ఇంకా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నాయి.రాబోవు ఎన్నికలే లక్ష్యంగా కుట్రకు శ్రీకారం చుట్టే క్రమంలో తిప్పికొట్టాం. ములుగు జిల్లాలో మావోయిస్టులను అడుగు పెట్టనివ్వమని ఎస్పీ గాస్‌ ఆలం హెచ్చరించారు. తెలంగాణాలో మావోయిస్టులు ఏదో ఒక నేరం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఆ సమాచారంతో జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టగా మావోయిస్టులు పసిగట్టి కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఏజన్సీ ప్రాంత ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దు.. వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు తెలుపాలని అయన అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *