కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించింది
కృష్ణా బేసిన్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారు
గవర్నర్‌ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్‌ బాధ్యత ఏంటో అర్థమవుతోంది
అసెంబ్లీ సమావేశాల అనంతరం విూడియా చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌ ఫిబ్రవరి 8: కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్‌ విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. హైకోర్టు అంశాలను కేబినెట్‌లో లేదా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కృష్ణా .జలాల విషయంలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని చెప్పారు. కృష్ణా బేసిన్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నారు. కేసీఆర్‌, ఃఖీూ గురించి ప్రజలు మర్చిపోయారని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్‌ బాధ్యత ఏంటో అర్థమవుతోందన్నారు. కేసీఆర్‌ కాలం చెలిన ఔషధమని పేర్కొన్నారు. విపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.మిషన్‌ భగీరథపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.ఉద్యోగ నియామకాల విషయంలో తాము ఎంతో స్పష్టతంగా ఉన్నామని రేవంత్‌ రెడ్డి అన్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారనేది.. అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు చాంబర్‌ ఇవ్వాలని కోరారు. వారికి చాంబర్‌ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వవద్దు అనేది తమ పరిధిలోని అంశం కాదని.. ఇది స్పీకర్‌ పరిధిలోని అంశంగా ఆయన పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *