నంద్యాల: శ్రీరామ బంటు హనుమంతుడు లా బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు.నంద్యాల బిజెపి కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కసేట్టీ చంద్రశేఖర్ అధ్వర్యంలో ఆర్యవైశ్యులు అభిరుచి మదు సమక్షంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ బంటు హనుమంతుడు ఎంత నమ్మకంగా వున్నారో బిజెపి పార్టీ పై నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు.పార్టీలో దుద్దెల శంకర్,మేడం కార్తిక్,సుంకు రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి ప్రధాని మోడీ దోహదపడ్డారని అన్నారు.మోడీ చేస్తున్న పథకాలు ఆకర్షించి పార్టీలో చేరనున్నారు.కొవ్వూరు సుబ్రమణ్యం,సత్యనారాయణ, కూరకు భారత్, అక్షయ కుమార్,చిలమనూరు రవితేజ,గేలివి కిషోర్,లగిసెట్టీ నవీన్,మోహన్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్,కిసాన్ మోర్చ అధ్యక్షులు రామకృష్ణా రెడ్డి,ఉపెంద్రణత్ రెడ్డి,లక్ష్మి రెడ్డి , పసుపుల సాయి తదితరులు పాల్గొన్నారు.