పేద ప్రజల ఆకలి తీర్చేందుకు’’ మోది క్యాంటీన్‌’’.
అన్నా క్యాంటీన్‌ లో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ కు వినతి పత్రం.
అభిరుచి సేవాసమితి ఆర్థిక సాయంతో.
…సేవకు అడ్డు పడొద్దు..
అభిరుచి మదు.
నంద్యాల: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సవిూపంలో మోది క్యాంటీన్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ శ్రీనివాసులు కు నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మదు అందించారు.కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శ్రీనివాసులు కు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వున్న అన్నా క్యాంటీన్లో పేదల కు ఉచిత భోజనం అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వెచ్చే రోగులు,బందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.పేదవారు అధికంగా వస్తుండడంతో వైద్యం ఖర్చులతో పాటు భోజన ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని అన్నారు.అభిరుచి సేవా సమితి ద్వారా ఉచితంగా బోజన వసతి కల్పించాలని నిచ్చాయించుకున్నానని అన్నారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి సవిూపంలో అన్నా క్యాంటీన్‌ నిరుపయోగంగా వుండడంతో అక్కడ మోది క్యాంటీన్‌ కు అనుమతి ఇస్తే సొంత ఖర్చులు పెట్టుకుంటాను అన్నారు.అన్నా క్యాంటీన్‌ లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం కలెక్టర్‌ దృష్టికి తీసుకొని పోయానని అన్నారు.ఆసుపత్రి అధికారితో మాట్లాడుతానని కలెక్టర్‌ చెప్పారని అన్నారు.పేద ప్రజల ఆకలి తెరిస్తే జీవితంలో అంతా కంటే ఆనందం ఏమి లేదన్నారు.డబ్బు ఎంత సంపాదించినా సేవలో వచ్చే ఆనందం మరువలేనిది అన్నారు.అధికారులు ఏర్పాటుకు అవకాశం ఇస్తే త్వరలో పేదలకు నాణ్యమైన భోజనం ఉచితంగా అందిస్తానని అన్నారు.నా సంకల్పానికి అందరూ ఆశీర్వదించండి,సేవకు అడ్డుపడవద్దని కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *