ఈ నెల 19 న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బడుగు బలహీన వర్గాలు తరలి రావాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సోమవారం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని బడుగు,బలహీన వర్గాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ ను శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు.భావితరాలకు స్ఫూర్తిగా విజయవాడలో సుమారు రూ 400 కోట్లతో నిర్మించినఅంబేద్కర్ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న ఆవిష్కరిస్తారన్నారు.దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా జన్ భగీదరి పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దళితులు,దళిత సంఘాలు, బలహీన, మైనారిటీలు,అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి దిగ్విజయం చేయాలని కోరారు.
ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ని సత్కరించిన దళిత నాయకులు:
అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ రాయచోటి నియోజకవర్గం లో దళిత సంఘాల నాయకులు, వైఎస్ఆర్సిపి ఎస్సీ, ఎస్టీ వర్గాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు. విజిలెన్స్ కమిటీ సభ్యులు కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ని దుస్సాలువలతో సత్కరించారు