అమరావతి:జనవరి 08:నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు.9న రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష చేయనుంది. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.ఏపీలో ఓట్ల గల్లంతు, జాబితాలో అవకతవకలపై సీఇసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయనున్నారు.