అన్నమయ్య జిల్లా,రాయచోటి :రెండు రోజుల కిందట అమరావతిలోని తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం రామాపురం మండలములోని తన స్వగృహం చేరుకున్నారు,ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయుకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొని ద్వారకనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయనను కలిసి అపూర్వ స్వాగతం పలికి,అభినందనలు తెలియచేశారు.

ఈకార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రవీంద్ర బాబు, మాజీ జెడ్పీటీసీ అనుంపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, గాలివీడు మండల మాజీ ఎంపీపీ ప్రభాకర్ నాయుడు, రామాపురం మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు అయోధ్యపురం భూషణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగసుబ్బరెడ్డి, రామాంజనేయ రెడ్డి,అయోధ్యపురం పవన్ కుమార్ రెడ్డి,రేకం ఆంజనేయులు, రెకం రాజశేఖర్, రేఖాం శివయ్య,లోకేష్ మాజీ ఎంపీటీసీ ధర్మయ్య,సర్పంచ్ శంకరయ్య,బండారు సాయి ప్రసాద్,మద్దిరేవుల బాబురెడ్డి,కాంట్రాక్టర్ రాజు, చంచర్ల ఆంజనేయులు,మాజీ సర్పంచ్ జయరాజు, సంబెపల్లె గోవర్ధన్ రెడ్డి,సైదియ హల్ షేక్ నియాజ్ తదితరులు పాల్గొన్నారు

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *