ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

– పోలింగ్ బూత్ స్థాయి నుంచి బీజేపీ ని బలోపేతం చేయాలి

– బీజేపీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన

గాలివీడు డిసెంబర్30: దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షడు సాయి లోకేష్ కుమార్ పేర్కోన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గొట్ల మిట్ట శ్రీనివాసులు రెడ్డి , బీజీపీ మీడియా జిల్లా అధికార ప్రతినిధి యర్నాగు భాస్కర్ రెడ్డి ల అధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.పోలింగ్ బూత్ స్థాయి నుంచి బీజేపీ రాజంపేట పార్లమంట్ ని బలోపేతం చేయడంతోపాటు పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. మండల కమిటీలో శక్తి ,పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం వారి ద్వారా పార్టీను గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో మన ప్రాంతంలో బీజేపీ అంధ్రప్రదేశ్ గా గెలవాలని కోరుకుంటున్నామని అన్నారు .ఓ పక్క పార్టీ సంస్థాపక నిర్మాణం మరో వైపు ఓటరు మహాశయులను ఆకర్షించేలా అందరూ కృషి చేయాలని తెలిపారు.  బీజేపీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలని సాయి లోకేష్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీలో కింది స్థాయి నుంచి వచ్చిన కార్య కర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.మోదీ పాలనలో ప్రపంచంలోనే దేశం శక్తివంతంగా ఎదిగిందన్నారు. మోదీ అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలన్నారు. అనంతరం బీజేపీ జిల్లా మీడియా అధికార ప్రతినిధి భాస్కర్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షడు శ్రీనివాసులు రెడ్డి లు గాలివీడు మండలములో నెలకొన్న సమస్యలు పై బీజేపీ అధిష్ఠానం కు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెల్లే విధంగా కృషి చేయాలని ఈసందర్భంగా సాయి లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంటు జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి , జిల్లా ప్రధాన కార్యదర్శులు .కృష్ణ యాదవ్ , ప్రశాంత్ , జిల్లా అధికార ప్రతినిధి యర్రనాగు భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు గొట్లమిట్ట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సురేంద్ర, మండల కార్యదర్షులు వీరారెడ్డి, మణి కుమార్, బిజెపి పార్టీ సీనియర్ యువ నాయకులు అర్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *