కడప, సెప్టెంబర్ 28 : వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులకు జిల్లాలో ఆశ్రయం కల్పించినవారు వారి వివరాలు విధిగా ఆన్ లైన్ ద్వారా బ్యూరో అఫ్ ఇమిగ్రేషన్ పోర్టల్ లోని Form-C నందు నమోదు చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్  గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలో పుణ్యక్షేత్రాలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు, అనాధ శరణాలయాలు మరియు టూరిజం ప్రాంతాలు వుండటంతో వివిధ దేశాల నుండి విదేశీయులు జిల్లాకు వస్తుంటారని, అలాంటి వారికి స్థానికంగా వున్న ప్రజలు, లాడ్జీలు, అతిధి గృహాలు, రిసార్ట్స్ వంటి వాటిల్లో ఆశ్రయం కల్పిస్తే సెక్షన్ 16(7) ఆఫ్ ఫారినర్స్ అమెండ్మెంట్ ఆర్డర్ 2016 ప్రకారం, (https://boi.gov.in) లోని Form-C నందు నమోదు చేయవలెను. సమాచారం ఇవ్వకుంటే సెక్షన్ 14(c) అఫ్ ఫారినర్స్ ఆక్ట్ 1946 మేరకు శిక్షార్హులని, సంబధిత వ్యక్తికి ఐదేళ్ళ పాటు జైలు శిక్ష వుంటుందని జిల్లా యస్.పి సిద్ధార్థ్ కౌశల్   సూచించినారు.  దృష్టిలో ఉంచుకొని విదేశీయులకు ఆశ్రయం ఇచ్చినవారు/కల్పించినవారు తప్పకుండా 24 గంటలలోపు సమాచారం అందించాలని, ఇతర వివరాలకు జిల్లా ఎస్.పి   క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక బ్రాంచి విభాగం అధికారి అయిన (శ్రీ కె. అశోక్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, కడప, సెల్.నెం. 9121100652 ని సంప్రదించాలని యస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *