అమరావతి సెప్టెంబర్‌ 28: జనసేన, తెలుగుదేశం సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను పవన్‌ కళ్యాణ్‌ నియమించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌అధ్యక్షతన గురువారం నాడు సమావేశం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు హాజరయ్యారు. పవన్‌ కళ్యాణ్జనసేన ` టీడీపీ పొత్తు అంశంపై స్పష్టమైన ప్రకటన చేసిన క్రమంలో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, వారాహి విజయ యాత్రపై చర్చించారు. వచ్చే ఎన్నికలకు జనసేన ` టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేసేలా ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *