శ్రీకాకుళం డిసెంబర్ 9: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని విమర్శించారు. వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మళ్లీ రామరాజ్యం వస్తుందని, కరువు వచ్చినా.. వరద వచ్చినా.. ప్రజలకు ఏం బాధ వచ్చినా ప్రభుత్వం ఉందన్న విషయం ప్రజలు ఎప్పడో మర్చిపోయారని విమర్శించారు.శ్రీకాకుళం జిల్లాకు చివరన ఓ పనికి మాలిన.. అవగాహన లేని మంత్రి ఉన్నాడని, కాలువల్లో పూడికలు తియ్యకపోవడం వలనే రైతాంగానికి ఈ దుస్థితి వచ్చిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తక్షణమే శ్రీకాకుళం జిల్లాను నందిగాం మండలంను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ సంవత్సరం పంట నష్టపరిహారాన్ని కూడా తామే చెల్లిస్తామని రైతులకు అచ్చెన్నాయుడు హావిూ ఇచ్చారు. నందిగామ మండలంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను అచ్చెన్నాయుడు పరిశీలించారు.