పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్
విశాఖపట్నం డిసెంబర్ 9: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తూ శనివారం నాడు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…ఎన్నికలకు 90రోజులే గడువుంది ఎవరి సత్తా ఏంటో అక్కడ తేల్చుకుందాం. టైకూన్ జంక్షన్ మూసివేయడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్థానిక యంత్రంగానికి అర్థం కావడం లేదని చెప్పారు. ఆ జంక్షన్‌లో, వేసిన బారికేడ్లను తొలగించాలని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పారని అన్నారు. క్రైస్తవుల భూములను అన్యాయంగా లాక్కొని, ఎంపీ నిర్మాణాలను చేస్తున్నారన్నారు. అక్రమంగా టీడీఆర్ 63 కోట్లు కొట్టేశారని చెప్పారు. అధికార పార్టీకి లొంగి పోయి పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఈ రోడ్డుని తక్షణమే తొలగించాలని జనసేన డిమాండ్ చేస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.