తాడేపల్లిగూడెం: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పట్టిన వికషిత్ భారత్ సంకల్ప యాత్ర శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సభకు సర్పంచ్ శ్రీమతి బేదపూడి వెంకట సుబ్బలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బిజెపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఈతకోట భీమశంకరరావు (తాతాజీ) మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర ఏళ్లుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సమగ్రంగా వివరించారు. ప్రధాని మోదీ కేంద్రం ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నారని స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా గ్రామాలను సుందరంగా ఉంచుకోవాలని మరియు ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్, ఉచిత బియ్యం, (గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ), ఉపాధి హావిూ పథకం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు అందరూ వీక్షించాలని తద్వారా దేశంలో జరిగే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను తాతాజీ గారుతెలియజేశారు . ఈ సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు , తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో కన్వీనర్ రామ గాని భాస్కర సత్యనారాయణ , పశ్చిమగోదావరి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కొండపల్లి నగేష్ నరిసే సోమేశ్వరరావు తాడేపల్లిగూడెం రూరల్ మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్ , పట్టణ ప్రధాన కార్యదర్శి వన్నేంరెడ్డి నవీన్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ సభని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను డిజిటల్ వాహనంలో ప్రదర్శించారు.