అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె,డిసెంబర్‌9:రాష్ట్రంలోని అర్హులందరూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాజంపేట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్‌ పేర్కొన్నారు.శనివారం అన్నమయ్యజిల్లా,లక్కిరెడ్డిపల్లె, రెడ్డివారిపల్లెలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’’ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలుపాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజంపేట పార్లమెంట్‌ బిజేపి జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్‌ మాట్లాడుతూ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం , అభివృద్ధి , మౌలిక వసతులు ప్రజలకు చేరువయ్యే దిశగా ‘‘మోడీి గ్యారంటీ వాహనం’’ ద్వారా ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమంలో కేంద్రప్రభుత్వం మహిళలకోసం ప్రవేశపెట్టి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచితంగా మంజూరైన రూ.7000 విలువగల గ్యాస్‌ సిలిండర్‌,స్టౌవ్‌,రెగ్యులేటర్‌,పైపు పలువురికి పంపిణీచేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ యోజనకింద రూ.500000లక్షల విలువగల ఆరోగ్య బీమా కార్డులను పంపిణీ చేశారు. ప్రధామంత్రి ఆవాస్‌యోజన కింద మంజూరైన ఇళ్లు గురించి,స్వచ్ఛా భారత్‌ పేరుతో మంజూరైన మరుగుదొడ్ల గురించి అధికారులు వివరించారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాదీ హామీ పథకం, ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం, పి.ఎం. కిసాన్‌ నిధి పేరుతో రైతులకు అందిస్తున్న డ్రోన్‌ పరికరాల గురించి ప్రజలకు అధికారులు వివరించారు.కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 17 ప్రజాసంక్షేమ పథకాల గురించి బిజేపి జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్‌ ప్రజలకు వివరించారు. ఇప్పటికీ అర్హులై వుండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు రానివారు వుంటే దరఖాస్తు చేసుకోవాలని,ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం మరో 5సంవత్సరాల పాటు ప్రధానమంత్రి పొడగించారని సాయిలోకేష్‌ తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో బిజేపి రాయచోటి నియోజకవర్గ కో కన్వినర్‌ నిర్మల్‌ కుమారు,జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు శివప్రసాద్‌,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పలువురు బిజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *