న్యూఢల్లీి, డిసెంబర్‌ 9: భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే అగ్ర దేశాలకు చెందిన నాయకులను వెనక్కి నెట్టి మరీ మోదీ మొదటి స్థానంలో నిలిచారు.ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుల్లో ప్రధాని మరోసారి ముందువరుసలో చోటుదక్కించుకున్నారు. ఏకంగా 76 శాతం మంది ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్‌ సంస్థ మార్నింగ్‌ కన్సల్ట్‌ విడుదల చేసిన గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 7వ తేదీ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడిరచారు. నవంబర్‌ 29 నుంచి డిసెబర్‌ 5వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలను వెల్లడిరచారు.ఈ రేటింగ్‌ ప్రకారం మోదీ తర్వాత 66 శాతం ప్రజాదారణతో మెక్సికో ప్రధాని అండ్రిస్‌ మాన్యుయల్‌ లొపేజ్‌ ఆబార్డర్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో స్విట్జార్లాండ్‌ ప్రధాని అలైన్‌ బెర్సెట్‌ 58 శాతం ఆమోదంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక 49 శాతం మంది ఆమోదంతో బ్రెజిల్‌ ప్రధాని.. లూయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా 4వ స్థానంలో నిలిచారు. ఇక 47 శాతంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ 5వ స్థానంలో ఉన్నారు. ఇటలీకి ప్రధాని జార్జియా మెలోని 6వ స్థానంలో నిలిచారు.
పాకిస్తాన్‌ లోనూ…
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరయ్యా అంటే అదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసేదీ కూడా అతన్నే. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ కూడా ఆయన వెనుకే ఉన్నారు. సెప్టెంబరులో గ్లోబల్‌ రేటింగ్‌ ఆమోదం ద్వారా విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకుల జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అతడిని ఇష్టపడే వారు పాకిస్థాన్‌లో కూడా ఉన్నారు.నవంబర్‌ 29న పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అంజు ఈ విషయాన్ని వెల్లడిరచింది. తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు నస్రుల్లాను వివాహమాడిన అంజు భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి అంజు భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి, ఆమె అక్కడి ప్రజల గురించి, తన అనుభవాల గురించి కొత్త విషయాలను పంచుకుంటుంది. అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టమని, అక్కడ ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారని అంజు చెప్పింది. పాకిస్థాన్‌లో కూడా ప్రధాని మోదీ లాంటి నాయకుడిని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.పాకిస్థాన్‌లోని తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు నస్రుల్లాతో రాజకీయాల గురించి ఎలాంటి సంభాషణలు చేయలేదన్నారు అంజు. అయితే అక్కడ ఉంటున్న తర్వాత తనకు తెలిసిందని, పాకిస్తాన్‌ ప్రజలు భారత ప్రధానిని చాలా గౌరవిస్తారన్నారు. ప్రధాని మోదీ గురించి, భారత్‌ గురించి తెలుసుకోవాలని పాకిస్థానీయులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అక్కడ ప్రజలు అంజును ప్రధాని మోదీ గురించి చాలా ప్రశ్నలు అడిగారు. పాకిస్థాన్‌ కూడా అభివృద్ధి చెందాలంటే తమ దేశానికి ప్రధాని మోదీ లాంటి నాయకుడు అవసరమని పాకిస్థానీలు భావిస్తున్నారని అంజు పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *