తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి న్యాయవాదులకు హామీ

* భూ హక్కుల చట్టం కాదు ఇది తుగ్లక్ చట్టం
* నాలుగేళ్లలో అన్ని ప్రజా వ్యతిరేక చట్టాలే చేశారు
* మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ,

రాయచోటి, 7 డిసెంబరు 2023: ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27- 23 ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు చేస్తున్న ప్రజా ఉద్యమంలో తాము కూడా భాగస్వాములై ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి న్యాయవాదులకు హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న భూ హక్కుల చట్టం రద్దు కోసం చేస్తున్న ఉద్యమాన్ని బలపరచాలంటూ భారత న్యాయవాదుల సంఘం గురువారం మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఈ చట్టం వలన చిన్న సన్నకారు రైతులకు జరిగిన నష్టాన్ని గురించి న్యాయవాదులు వారికి వివరించారు. అనంతరం వారి వారి కార్యాలయాలలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో సమావేశంలో వారు మాట్లాడారు . దేశం నాయకులు ఇద్దరు కూడా స్పందించి న్యాయవాదులు ప్రజా సంఘాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న న్యాయమైన ఉద్యమాన్ని అందరము కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల సంపదలను ఇప్పటికే జగన్ ప్రభుత్వం దోచేసిందని ఇక పేదల భూములను వారి అనుచరులు కబ్జా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఇది రద్దయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని వారు అన్నారు. ఏ వ్యవస్థలో నైనా ప్రజలకు అన్యాయం జరిగితే చివరకు న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారని అయితే ఈ చట్టం వలన ప్రజలకు న్యాయవ్యవస్థ దూరం చేసే విధంగా ఉందని ప్రజాస్వామ్య దేశానికి ఈ రకమైన చట్టం అవసరం లేదని ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చట్టాలు అమలులోనికి వస్తే ప్రజల భూములకు భద్రత ఉండదని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి ప్రతి మండలంలో కూడా ఒక కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కానీ జగన్ ప్రభుత్వం ఉన్న న్యాయ వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా తన తుగ్లక్ చట్టంతో ప్రజల భూములు కబ్జా చేయాలని చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో భారత న్యాయవాదుల సంఘం కడప అన్నమయ్య జిల్లా ల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్, సహాయ కార్యదర్శి మిఠాయిగిరి ఖాదర్ బాషా, పౌర హక్కుల సంఘం న్యాయవాది రెడ్డయ్య ,రవిశంకర్ అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి అధ్యక్షులు రాజకుమార్ రాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు దేవపట్ల నాగ ముని టీవీ రమణ, హుమాయూన్ బాషా, ఆదిరెడ్డి నాయక్, జనార్దన్ రెడ్డి , పెమ్మడపల్లి సర్పంచ్ వల్లపు వాసు, ప్రజా సంఘాల నాయకులు పల్లం తాతయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు రజక సంఘం నాయకులు శ్రీనివాసులు రమేష్ విద్యావంతుల వేదిక మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి

 

తెలుగుదేశం పార్టీ నాయకులకు వినతి పత్రాలను సమర్పిస్తున్న భారత న్యాయవాదుల సంఘం నాయకులు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *