రజీఉద్దీన్ సాహెబ్ ఫఖ్రె ఉర్దూ అవార్డు కు ఎంపిక
అభినందన సభ…. ముషాయిరా
సత్తార్ ఫైజి పుస్తకావిష్కరణ
రాయచోటి బజ్మె సాఖి ఎ సుఖన్ ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీ డిసెంబర్ 2023 శనివారం సాయంత్రం 6 గంటలకు కాయనాతె అదబ్ రాయచోటి నందు రజీఉద్దీన్ సాహెబ్( బజ్మె హుసేని ఉర్దూ సంస్థ స్థాపకుడు,) ఉర్దూ సాహితి వెత్త గత 20 సంవత్సరాల నుండి ఉర్దూ విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు విశిష్ట సేవలు అందించినందుకు ఫఖ్రె ఉర్దూ అవార్డు కు ఎంపిక చేశారని ఆయన కు అభినందన సభ, సత్తార్ ఫైజి గజళ్ళ పుస్తకం”నషీద్” ఆవిష్కరణ అనంతరం ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తూన్నట్లు కన్వీనర్ లియాఖత్ అలి ఖాన్ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఇమాం ఖాసీం సాఖి లు తెలిపారు.
సభ కు అధ్యక్షత రాయలసీమ ఉర్దూ రచయితల సమైఖ్య ప్రధాన కార్యదర్శి సత్తార్ ఫైజి వహిస్తారని, ముఖ్య అతిథిగా అబ్దుర్ రౌఫ్ (హైదరాబాద్) గౌరవ అతిథిగా మహ్మద్ అలీ ఖాన్ జౌహర్ (మదనపల్లె) వ్యాఖ్యాతగా ముహమ్మద్ ఖలీల్ హుస్సేన్ జానీబ్ వ్యవహరిస్తారు.
రాయచోటి, కడప ప్రముఖ ఉర్దూ కవులు పాల్గొంటారని ఉర్దూ సాహితి ప్రియులు పాల్గొనాలని వారు కొరారు.