తిరుపతి, డిసెంబర్‌ 2: ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్‌ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్‌ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయంతో పోగొట్టుకున్నవారి ఫోన్‌లు తిరిగి వారి చేతికి వచ్చేస్తున్నాయి. మోబైల్‌ హంట్‌ (వాట్సాప్‌ నెంబర్‌ 9490617873) అప్లికేషన్‌ సేవల ద్వారా వాట్సాప్‌కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో జిల్లా వ్యాప్తంగా సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులకు 6 విడతలలో రూ. 2,93,40,000/` విలువ గల 1630 సెల్‌ ఫోన్‌ లను రికవరీ చేసి సదరు బాధితులకు అందించారు.గత రెండు నెలల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.1.08 కోట్ల విలువ గల 600 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా బాధితులకు మొబైల్‌ ఫోన్లను అందజేశారు. ఇప్పటి వరకు మోబైల్‌ హంట్‌ అప్లికేషన్‌ ద్వారా ఇప్పటి వరకకు రూ.4.1కోట్ల విలువ గల మొత్తం 2230 మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకోగా వాటిని రికవరీ చేశారు తిరుపతి పోలీసులుమంచి ఫలితాలు ఇస్తున్న మొబైల్‌ హంట్‌ అప్లికేషన్‌ సేవలు తిరుపతి తిరుమల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి వెళుతుంటారు. తిరుపతి బస్సు స్టేషన్‌, రైల్వే స్టేషన్‌ తదితర రద్దీ ప్రాంతాలలో మొబైల్‌ పోగొట్టుకోవడమో లేదా దొంగలించడమో జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి 2023`ఫిబ్రవరి నెలలో మోబైల్‌ హంట్‌ (చిఊరుూంఖఖ 9490617873) అప్లికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. అలా పోగొట్టుకున్న మొబైల్స్‌ ను ఒక ప్రక్క రికవరీ చేసి, బాధితులకు అందజేస్తూ, మరో ప్రక్క పిక్‌ పాకెటర్ల కదలికలపై సిసి కెమేరాలతో ప్రవేక్షిస్తూ, విసిబల్‌ పోలీసింగ్‌ ను పెంచి అనుమానితులపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *