న్యూఢల్లీి నవంబర్‌ 23: డీప్‌ఫేక్‌ సమాజానికి ప్రమాదకరంగా తయారైనట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. ఇవాళ వివిధ సోషల్‌ విూడియా ఫ్లాట్‌ఫామ్‌లతో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త నియంత్రణ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. కొన్ని వారాల్లోనే ఆ మార్గదర్శకాలకు చెందిన ముసాయిదాను అందుబాటులోకి వస్తుందన్నారు. విూడియా సమావేశంలో మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్‌లు తీవ్ర ప్రమాదకరంగా మారినట్లు వెల్లడిరచారు. రష్మిక మందానా, కాజోల్‌, ప్రధాని మోదీకి చెందిన డీప్‌ఫేక్‌ వీడియోలు, ఇమేజ్‌లు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే.సోషల్‌ విూడియా, ఏఐ కంపెనీలతో నిర్వహించిన విూటింగ్‌లో నాలుగు అంశాలను చర్చించినట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, పోస్టింగ్‌ చేయకుండా నియంత్రించడం, వైరల్‌ కాకుండా చూడడం, రిపోర్టింగ్‌ వైఖరి గురించి పలు కంపెనీలతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌ల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించే అంశం గురించి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విూడియా కలిసి పనిచేయాలన్నారు.ు కంపెనీలతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌ల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించే అంశం గురించి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విూడియా కలిసి పనిచేయాలన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *