న్యూ డిల్లీ నవంబర్ 22: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు హెచ్చరికలు చేసింది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.కాగా బుధవారం, గురువారం కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (ఎఓఆ) అంచనా వేసింది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.